Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup: ఆసీస్ ఓటమి వెనుక భారత మాజీ కోచ్ లు ? జయసూర్య ప్రశంసలు.!

టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026) లో భాగంగా తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్ లో (SL vs Aus) ఆతిధ్య శ్రీలంక అద్బుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను కేవలం 182 పరుగులకే శ్రీలంక బౌలర్లు కట్టడి చేస్తే.. బ్యాట్స్ మెన్ అనంతరం సునాయాస లక్ష్యాన్ని అంతే అనాయాయంగా కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. దీంతో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఆసీస్ పై ఘన విజయం సాధించింది. అలాగే ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.

శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమితో ఇక ఆస్ట్రేలియా దాదాపుగా ఇంటిముఖం పట్టినట్టే భావిస్తున్నారు. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు ఓడి ఒకటి గెలిచిన ఆస్ట్రేలియాకు ఇది అతి పెద్ద షాక్. అలాగే వరల్డ్ కప్ లోనూ భారీ సంచలనమే. దీని వెనుక భారత్ కు చెందిన ఇద్దరు మాజీ కోచ్ లు ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీలంక గెలుపు తర్వాత ఆ జట్టు ప్రధాన కోచ్ సనత్ జయసూర్య వెల్లడించాడు. దీంతో ఆ ఇద్దరిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

T20 World Cup Upset How Two Ex-Indian Coaches Engineered Sri Lanka s Win vs Australia

టీమిండియా మాజీ కోచ్ లు ఆర్ శ్రీధర్, విక్రమ్ రాథోడ్ నిన్న ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం వెనుక కీలక పాత్ర పోషించినట్లు సనత్ జయసూర్య చాలా నిజాయితీగా వెల్లడించాడు. ప్రస్తుతం శ్రీలంకకు ఫీల్డింగ్ కోచ్ గా ఉన్న ఆర్ శ్రీధర్ తో పాటు బ్యాటింగ్ కోచ్ గా ఉన్న విక్రమ్ రాథోడ్ ఇద్దరూ గుడ్ జెంటిల్మెన్ అని, వాళ్లు ప్రాక్టీస్ లో తాము ఏం కోరుకుంటున్నామో అదే చేసి పెట్టారని జయసూర్య వారిని పొగడ్తలతో ముంచెత్తాడు. శ్రీధర్ తన ఐపీఎల్ అనుభవంతో ఆటగాళ్లతో నిజంగా బాగా పని చేస్తున్నాడని కితాబిచ్చాడు. అలాగే తాము బ్యాటర్లకు చాలా ఆత్మవిశ్వాసం ఇచ్చామని, కొన్నిసార్లు కోచ్‌లుగా తాము బ్యాటింగ్ యూనిట్‌తో నిరాశ చెందవచ్చని, అయినా ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం ఇచ్చామన్నాడు. విక్రమ్, శ్రీధర్ నిజంగా మంచివారని జయసూర్య తెలిపాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+