మహ్మద్ సిరాజ్ వివాహం ఫిక్స్- వధువు ఎవరంటే..!!
మహమ్మద్ సిరాజ్. టీమిండియా క్రికెట్ సంచలనం. హైదరాబాదీ అయిన సిరాజ్ ఇప్పుడు ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ షేరం చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, అనతి కాలంలోనే స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇక తాజాగా భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లోనూ రాణించాడు. 9 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వివాహానికి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే సిరాజ్ ఓ ఇంటివాడు కానున్నాడని తెలుస్తోంది.
సిరాజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిరాజ్ కుటుంబ నేపథ్యం అందరికీ తెలిసిందే. సిరాజ్ తండ్రి ఎంతో కష్టపడి తన కుమారుడకి ఇష్టమైన క్రికెట్ లో రాణించేందుకు పూర్తిగా సహకారం అందించారు. ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఓడిన తరువాత సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యారు. గ్రౌండ్ లోనే కన్నీటి పర్యంతమయ్యారు. టీం సహచరులు సిరాజ్ ను ఓదార్చారు. ఇక, హైదరాబాద్ విమానాశ్రయంలో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచ కప్ లో సిరాజ్ ఆట తీరును ప్రశంసించారు. ఇప్పుడు సిరాజ్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయితో సిరాజ్ ఏడడుగులు వేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.

సిరాజ్ వివాహానికి సంబంధించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ సిరాజ్ వివాహం చేసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తన చిన్ననాటి స్నేహితురాలినే వివాహమాడనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తపై స్పందించడానికి సిరాజ్ ఆ సమయంలో నిరాకరించాడు. దీంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. కానీ, ఇప్పుడు పెళ్లికి సంబంధించి మంతనాలు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మధ్యలో సిరాజ్ వివాహం జరగనున్నట్లు సమాచారం. సిరాజ్ ప్రపంచ కప్ లో మొత్తం 11 మ్యాచ్‌లలో 33.50 సగటుతో 14 వికెడ్లు పడగొట్టాడు. ఇక, ఇప్పుడు సిరాజ్ వివాహం వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications