IPL 2024: ఈసారి ఐపీఎల్ లో ప్రతీ జట్టూ హోం గ్రౌండ్ లో ఆడే తొలి మ్యాచ్ లివే..!

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2024) సీజన్ 17కు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. భారత్ లో ఎన్నికలు ఉన్నప్పటికీ ఇక్కడే ఐపీఎల్ టోర్నీ కొనసాగుతుందని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే ప్రథమార్ధం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో ప్రతీ టీమ్ తమ హోంగ్రౌండ్ లో ఆడే తొలి మ్యాచ్ ల వివరాలు ఉన్నాయి. టోర్నీ మొత్తం చూసుకుంటే సొంత గ్రౌండ్ లో ఆడే మ్యాచ్ లు ఎలాగో ఉంటాయి. కానీ హోం గ్రౌండ్ లో ఆడే తొలి మ్యాచ్ మాత్రం ఆయా జట్లకు ఎప్పుడూ ప్రత్యేకమే.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్ జట్టు తమ సొంత మైదానంలో తొలి మ్యాచ్ ను మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడబోతోంది. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు తమ తొలి మ్యాచ్ ను హోంగ్రౌండ్ అయిన ముంబైలో ఏప్రిల్ 1న రాజస్తాన్ రాయల్స్ తో ఆడబోతోంది. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ హోంగ్రౌండ్ లో తమ తొలి మ్యాచ్ ను మార్చి 25న పంజాబ్ కింగ్స్ తో ఆడబోతోంది.

these are the first home games for each team in ipl 2024...

అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ తమ హోం గ్రౌండ్ లో తొలి మ్యాచ్ ను మార్చి 27న ముంబై ఇండియన్స్ తో ఆడబోతోంది. అటు లక్నో సూపర్ జెయింట్స్ తమ హోం గ్రౌండ్ లో తొలి మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో మార్చి 30న ఆడబోతోంది. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ తమ హోం గ్రౌండ్ లో తొలి మ్యాచ్ ను మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది. పంజాబ్ కింగ్స్ తమ హోం గ్రౌండ్ లో తొలి మ్యాచ్ ను మార్చి 23న ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడబోతోంది.

అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తమ హౌం గ్రౌండ్ లో తొలి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ తో మార్చి 31న ఆడబోతోంది. రాజస్తాన్ రాయల్స్ జట్టు తమ హోం గ్రౌండ్ లో తొలి మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ తో మార్చి 24న ఆడబోతోంది. అలాగే గుజరాత్ టైటాన్స్ తమ హోం గ్రౌండ్ లో తొలి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ తో మార్చి 24నే ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ ఐపీఎల్ ప్రథమార్ధంలోనే ఉండబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+