Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

న్యూజిలాండ్ తో సిరీస్ నుంచి తెలుగోడు అవుట్..: అతని స్థానంలో

టీ20 వరల్డ్ కప్ గడువు దగ్గరపడుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఫిబ్రవరి 7వ తేదీన తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో దీనిపై అనేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. రోజుల తరబడి సాగుతోందీ వ్యవహారం మొత్తం కూడా. ఇప్పటికే బంగ్లాదేశ్ తప్పుకొంది. ఈ జట్టుకు మద్దతుగా టోర్నమెంట్ ను స్పాయిల్ చేసేలా పాకిస్తాన్ అనూహ్య ఎత్తుగడలు వేస్తోంది గానీ ఏవీ పెద్దగా వర్కవుట్ కావట్లేదు.

ఈ పరిణామాల మధ్య భారత్ కూడా టీ20 వరల్డ్ కప్ కు సంబంధించిన కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంటోంది. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టాప్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ విషయంలో ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటోంది. భారత జట్టు మేనేజ్మెంట్. అతనిపై ఎటువంటి రిస్క్ చేయకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగనున్న చివరి రెండు టీ20లకూ అతన్ని దూరం పెట్టింది. దీంతో ఈ మ్యాచ్ లల్లో తిలక్ ఆడట్లేదు.

Tilak Varma to Miss Last Two T20Is Against New Zealand as Shreya Iyer continue with Robust Form

ఫలితంగా ఈ సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. గాయపడ్డ తిలక్ వర్మకు ప్రత్యామ్నాయంగా శ్రేయాస్ అయ్యర్ మొదటి మూడు టీ20 ఇంటర్నేషనల్స్ కు మాత్రమే ఎంపికయ్యాడు. ఇప్పుడు సిరీస్‌ మొత్తం జట్టుతో కొనసాగుతాడు. తిలక్ వర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆచితూచి వ్యవహరిస్తోండటమే దీనికి కారణం. ప్రపంచ కప్‌కు ముందు అతని విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోవడం లేదు.

ప్రస్తుతం గాయం నుంచి తిలక్ వర్మ పూర్తిగా కోలుకున్నాడు. వందశాతం ఫిట్ నెస్ సాధించాడు. అయినప్పటికీ టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా మేనేజ్మెంట్ మాత్రం అతనిపై రాజీ పడట్ లేదు. గాయం తిరగబెడితే టీ20 వరల్డ్ కప్ మొత్తానికీ దూరం కావాల్సి వస్తుందనే ఆందోళన జట్టు మేనేజ్మెంట్ లో వ్యక్తమౌతోంది. దీంతో న్యూజిలాండ్ సిరీస్ నుంచి అతన్ని తప్పించింది. ఈ నెల ప్రారంభంలో విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరఫున బెంగాల్‌పై చివరిసారిగా ఆడాడు తిలక్.

న్యూజిలాండ్ తో నాలుగో టీ20 కోసం తిలక్ వర్మ జట్టుకు అందుబాటులోకి వస్తాడని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించట్లేదని మేనేజ్మెంట్ భావిస్తోంది. నేరుగా ముంబైలో జరిగే సన్నాహక మ్యాచ్‌లల్లోనే ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 3న పూర్తి ఫిట్‌నెస్ సాధించాక తిలక్ వర్మ ముంబైలో జట్టుతో చేరతాడు. టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్ ఆడనున్న వార్మప్ మ్యాచ్‌లకు ముందు అతను అందుబాటులోకి వస్తాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+