బుడ్డోడి వికెట్ కోసం పెద్ద ప్లానే చేశా-ముందే చెప్పి మరీ..! ప్రఫుల్ హింగే షాకింగ్..!
ఐపీఎల్ (ipl 2026)టోర్నీలో భాగంగా నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం అందుకుంది. ఈ మ్యాచ్ కు ముందు వరుసగా నాలుగు మ్యాచ్ లల్లో భారీ ఇన్నింగ్స్, మెరుపులతో అదరగొడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. ఈ మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగిస్తాడని అంతా అనుకున్నారు. కానీ తొలి ఓవర్ లోనే రెండో బంతికి సన్ రైజర్స్ అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింగే (praful hinge) బౌలింగ్ లో డకౌటయ్యాడు. దీంతో ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. రాజస్థాన్ డకౌట్ షాక్ కు గురైంది.
ఈ మ్యాచ్ తో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన సన్ రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే .. ఇంత సునాయాసంగా వైభవ్ సూర్యవంశీ వికెట్ తీస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇప్పటికే బుమ్రా సహా ప్రపంచ స్థాయి బౌలర్లందరినీ విచక్షణారహిరంగా ఆడుకుంటున్న బుడ్డోడు.. ఈ మ్యాచ్ లో ప్రఫుల్ చేతికి చిక్కుతాడని, ఇలా తొలి ఓవర్లోనే డకౌట్ అవుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ అద్భుతం జరిగిపోయింది. దీనిపై మ్యాచ్ తర్వాత యువ పేసర్ ప్రఫుల్ హింగే స్పందించాడు. వైభవ్ వికెట్ ఆషామాషీగా వచ్చింది కాదని తేల్చేశాడు.

ఈ మ్యాచ్‌కు చాలా ముందే తాను వైభవ్ సూర్యవంశీ వికెట్ కోసం ప్లాన్ వేసుకున్నానని ప్రఫుల్ హింగే వెల్లడించాడు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను బౌన్సర్‌తో అవుట్ చేయాలనేది తన ప్రణాళిక అన్నాడు. ఈ విషయం గురించి ముందుగానే కొందరికి చెప్పానని హింగే వెల్లడించాడు. అన్నింటికన్నా ఉత్తమమైనది తొలి వికెట్, సూర్యవంశీది. ఎందుకంటే అతను ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని మొదటి బంతికే, బౌన్సర్‌తోనో లేదా మరే విధంగానైనా అవుట్ చేస్తానని తాను ముందుగానే ఇద్దరు ముగ్గురికి చెప్పానన్నాడు. మొదటి బంతికే అతని వికెట్ తీయాలని అనుకున్నానని, అదే తన ప్రణాళిక అన్నాడు. తమ బౌలింగ్ కోచ్ వరుణ్ భయ్యా తనకు ఈ విషయంలో చాలా సహాయం చేశాడని తెలిపాు. అలాగే తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు హింగే తెలిపాడు.












Click it and Unblock the Notifications