Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2026 Auction: వద్దన్న వారే కొనుక్కున్నారు..! వేలంలో అదృష్టవంతులు వీరే..!

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ (ipl 2026)కోసం ఇవాళ అబుదాబీలో జరుగుతున్న మినీ వేలం ఆసక్తికరంగా సాగింది. ఇందులో వేలం ప్రారంభం కాగానే పలువురు స్టార్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు తీసుకోకుండా షాకిచ్చాయి. దీంతో అసలు ఏం జరుగుతుందో చాలా మందికి అర్ధం కాలేదు. తొలి రౌండ్ లో భారీ మొత్తాలు వెచ్చించి ఈ స్టార్లను తీసుకునేందుకు నిరాకరించాయి. అయితే స్టార్లు అయిపోయాక పలువురు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు సైతం ఇలాంటి షాకులే ఇచ్చాయి. కానీ చివర్లో మాత్రం ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి.

తొలి రౌండ్ లో ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపకుండా దాదాపు అమ్ముడుపోయిన క్రికెటర్లుగా నిలిచిన పలువురు ఆటగాళ్లలో కొందరు మాత్రం వేలం చివరికి వచ్చే సరికి అమ్ముడయ్యారు. లాస్ట్ ఛాన్స్ లో మాత్రం ఇలా పలువురు అదృష్టవంతుల్ని ఫ్రాంచైజీలు కొనుక్కున్నాయి. దీంతో వీరంతా అదృష్టవంతులుగా నిలిచారు. ఇలాంటి క్రికెటర్ల జాబితాలో ఉన్న వారు ఎవరో, వారిని ఏయే జట్లు ఎంతకు కొనుక్కున్నాయో ఓసారి చూద్దాం..

Unsold to Sold The Twist of Fate for These Lucky Players at the IPL 2026 Auction

తొలుత అన్ సోల్డ్ క్రికెటర్లుగా నిలిచి ఆ తర్వాత అమ్మడుపోయిన వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ ను కొనుగోలు చేసేందుకు కోల్ కతా, హైదరాబాద్, లక్నో పోటీ పడ్డాయి. చివరికి హైదరాబాద్ 13 కోట్లకు కొనుక్కుంది. అలాగే కివీస్ బ్యాట్ మెన్ రచిన్ రవీంద్రను కోల్ కతా రెండు కోట్లకు కొనుక్కుంది. ముంబై బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ ఖాన్ ను 75 లక్షల కనీస ధరకు చెన్నై కొనుక్కుంది. కోల్ కతా ఆకాష్ దీప్ ను కూడా కోటి రూపాయలకు కొనుక్కుంది. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీని చెన్నైరెండు కోట్లకు కొనుక్కుంది. స్పిన్నర్ రాహుల్ చాహర్ ను పంజాబ్ తో పోటీ పడి మరీ చెన్నై 5.2 కోట్లు ఇచ్చి కొనుక్కుంది.

ఆస్ట్రేలియా బౌలర్ బెన్ డ్వార్షెయిస్ ను గుజరాత్ తో పోటీ పడి పంజాబ్ 4.40 కోట్లకు దక్కించుకుంది. ఆసీస్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 8.6 కోట్లు పెట్టి కొనుక్కుంది. అలాగే దక్షిణాఫ్రికా పేసర్ లొంగి ఎంగిడిని ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు తీసుకుంది. జోర్డాన్ కాక్స్ 75 లక్షలకు ఆర్సీబీకి అమ్ముడయ్యాడు. అమన్ రావు రాజస్థాన్ రాయల్స్ కు 30 లక్షలకు అమ్ముడయ్యాడు. మాయాంక్ రావత్ ను ముంబై, ప్రవీణ్ దూబేను పంజాబ్ బేస్ ప్రైస్ 30 లక్షల చొప్పున తీసుకున్నాయి. ఆసీస్ ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ ను హైదరాబాద్ 3 కోట్లకు తీసుకుంది. వీరితో పాటు సాహిల్ పరాఖ్ ను ఢిల్లీ, విశాల్ నిషాద్ ను పంజాబ్, బ్రిజేష్ శర్మను రాజస్థాన్ 30 లక్షల చొప్పున తీసుకున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+