సానియా మీర్జాతో క్రికెటర్ షమీ పెళ్లి..? ఫొటోలు వైరల్
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి అందరికి తెలిసిందే. సానియా మీర్జా తన 15 ఏళ్ల దాపంత్య జీవితానికి గుడ్ చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో .. అతనితో సానియా మీర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్నాడని..ఆ కారణంగానే సానియా మీర్జాతో అతను దూరంగా ఉంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ వార్తలను నిజం చేస్తూ సనా జావేద్‌ను షోయబ్ పెళ్లాడాడు. ఇదిలా ఉంటే సానియా మీర్జా కూడా మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ వార్తలొస్తున్నాయి. గత కొంతకాలంగా టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ , సానియా మీర్జా ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. షమీ తన భార్య హసిన్ జహాన్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. షమీపై ఆమె ఎన్నో ఆరోపణలు చేసి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత షమీ ఒంటరిగానే ఉంటున్నాడు. దీంతో మహమ్మద్ షమీ , సానియా మీర్జా పెళ్లికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా వీరిద్దరు పెళ్లికి చేసుకున్న కొన్ని ఫొటోలు సైతం సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి.

దీంతో వీరి అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఏఐ టెక్నాలజీ సాయంతో వీరి పెళ్లి అయినట్టు కొందరు ఆకతాయిలు చిత్రీకరించారు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన మహమ్మద్ షమీ , సానియా మీర్జా ఫేక్ పెళ్లి ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు.సానియా మీర్జా,మహమ్మద్ షమీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికే ఈ తరహా వార్తలపై ఈ ఇద్దరూ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
తాజాగా దీనిపై షమీ స్పందించారు. ఈ పుకార్లకు షమీ పుల్‌స్టాప్ పెట్టేశాడు. అలాంటిదేం లేదని.. అవన్నీ జస్ట్ రూమర్స్ అంటూ కొట్టిపారేశాడు. తన జీవితం ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందని, ఎవరో ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి వెళ్లినంత మాత్రన అంత సర్వనాశనం కాదని, తనతో తన కూతురి, తల్లి కుటుంబం అంతా ఉన్నారని షమీ పేర్కొన్నాడు. షమీ కెరీర్ విషయానికి వస్తే..అతడు ప్రస్తుతం గాయం నుంచి కొలుకుంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత.. గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధిస్తున్నాడు. త్వరలో టీమిండియా ఆడబోయే టెస్టు సిరీస్‌లతో షమీ కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications