సచిన్ నా హీరో-49 సెంచరీల రికార్డు సమం తర్వాత కొహ్లీ-త్వరలో 50 అన్న క్రికెట్ గ్రేట్..!

భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ టీమిండియాతో పాటు అందులో క్రికెటర్లు, మాజీలకు కూడా చిరస్మరణీయంగా మిగిలిపోయేలా కనిపిస్తోంది. ఒకప్పుడు పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సాధించిన 49 వన్డే సెంచరీల రికార్డును తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో సమం చేసిన కింగ్ విరాట్ కొహ్లీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతర్జాతీయంగా కూడా పలువురు క్రికెట్ దిగ్గజాలు కొహ్లీకి అభినందలు తెలుపుతూ ట్వీట్లు పెడుతున్నారు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో 49వ వన్డే సెంచరీతో కొహ్లీ తన రికార్డును సమం చేసిన తర్వాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలోనే కలిసి సచిన్ అభినందించాడు. ఈ నేపథ్యంలో సచిన్ గురించి కొహ్లీ కూడా స్పందించాడు. పుట్టిన రోజున అభిమానులకు సెంచరీని గిఫ్ట్ గా ఇచ్చిన కొహ్లీ.. అదే క్రమంలో సచిన్ రికార్డు సమ చేయడంపై స్పందిస్తూ ఆయన తన హీరో అని ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన కొహ్లీ.. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

virat kohli lauds sachin tendulkar on equalling his 49 centuries record, says my hero...

తన హీరో రికార్డును సమం చేయడం తనకు ప్రత్యేకమైన క్షణమని చెప్పాడు. సచిన్ బ్యాటింగ్ పరిపూర్ణమైనది కాబట్టి ఆయన టెండూల్కర్‌లా ఎప్పటికీ బాగుంటాడన్నాడు. అలాగే క్రికెట్ లెజెండ్ ఎల్లప్పుడూ తన హీరోగా ఉంటాడని కొహ్లీ తెలిపాడు.ఇది తనకు ఎమోషనల్ జర్నీ అని, టెండూల్కర్ నుండి ప్రత్యేక సందేశాన్ని స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని కోహ్లీ చెప్పాడు. తాను సచిన్ బ్యాటింగ్‌ను చూస్తూ పెరిగానని, బ్యాటింగ్ విషయానికి వస్తే ఆయన పరిపూర్ణంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. తాను సచిన్ అంత గొప్పగా రాణించలేనని, కానీ ఏం జరిగినా సచిన్ తన హీరోగా మాత్రం ఉంటాడన్నాడు.

అలాగే సచిన్ టెండూల్కర్ కూడా కొహ్లీ తన శతకాల రికార్డును సమం చేసిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇందులో ముందుగా బాగా ఆడావు విరాట్ అంటూ సచిన్ ట్వీట్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత తాను 49 నుంచి 50కి చేరుకోవడానికి (వయసులో) ఏడాది పట్టిందని, కానీ తన 49 సెంచరీల రికార్డు నుంచి 50 సెంచరీలకు చేరుకోవడానికి కొహ్లీకి మరికొన్ని రోజులు మాత్రమే పడుతుందని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కంగ్రాట్స్ అంటూ కొహ్లీకి అభినందనలు తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+