ఐపీఎల్ గాలి తీసిన సూపర్ స్టార్
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025, 18వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఓ మ్యాచ్‌లో గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయఢంకా మోగించింది. ఈ టోర్నమెంట్‌లో సీఎస్‌కేకు ఇది రెండో గెలుపు మాత్రమే. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లల్లో రెండింట్లో నెగ్గింది. మొత్తం నాలుగు పాయింట్లతో టేబుల్‌లో అట్టడుగున నిలిచింది.
నేడు- పంజాబ్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముల్లాన్‌పూర్ స్టేడియంలో మ్యాచ్ మొదలవుతుంది. ఈ రెండు జట్లు కూడా తాము ఆడిన చివరి మ్యాచ్‌లల్లో ఘన విజయాన్ని సాధించినవే. వాటి ఖాతాలో ఆరు చొప్పున పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో 5, 6 స్థానాల్లో ఉన్నాయి.

కోట్లాదిమందిని టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోన్న ఐపీఎల్, క్రికెట్ టోర్నమెంట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సాకర్ సూపర్ స్టార్ కెవిన్ డీ బ్రునె. యూరప్‌లో క్రికెట్‌ను ఎవరూ చూడరని చెప్పాడు. ఆ గేమ్‌కు ఏ మాత్రం ఆదరణ లేదని పేర్కొన్నాడు. మాంఛెస్టర్ సిటీ ఫుట్ బాల్ క్లబ్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు కెవిన్. ఆ జట్టు మిడ్ ఫీల్డర్.
సిటీ మీడియా టీమ్ కోసం నిర్వహించిన ఓ ఏఐ షోడౌన్ అనే గేమ్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా షో ప్రజెంటర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చాడు. యూరప్‌లో అయిదు మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ ఏదంటూ అడిగిన ప్రశ్నకు తొలుత అతను సరైన సమాధానం చెప్పలేకపోయాడు.
Kevin De Bruyne is not buying any of that🤣🤣🤣
— Maxxx (@SavioPrimeMCFC) April 10, 2025
you guys watch cricket? pic.twitter.com/689DgDF2IE
దీనితో ప్రజెంటర్ జోక్యం చేసుకుని ఓ లిస్ట్ ఇచ్చాడు. ఇందులో- ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, ఫార్ములా 1 గేమ్స్ ఉన్నాయి. క్రికెట్‌కు రెండో స్థానం ఇవ్వడం పట్ల కెవిన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. యూరప్‌లో అత్యంత ప్రజాదరణ పొందన స్పోర్ట్స్‌లో క్రికెట్‌కు రెండో స్థానం అనేది పచ్చి అబద్ధమని అన్నాడు.

యూరప్‌లో క్రికెట్ ఎవరు చూస్తారంటూ షో ప్రజెంటర్‌కు ఎదురు ప్రశ్న వేశాడు. క్రికెట్‌ను ఎగబడి చూస్తారని తాను అనుకోవట్లేదని వ్యాఖ్యానించాడు. ఈ లిస్ట్‌లో ఆయా స్పోర్ట్స్‌కు ఇచ్చిన ర్యాంక్‌లన్నీ కూడా నిజమేనంటూ ధృవీకరించినప్పటికీ- కెవిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. క్రికెట్‌కు ఆదరణ లేదనే మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పాడు.
ఈ కామెంట్స్- సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రికెట్ ప్రేమికులు దీనిపై ఘాటుగా రిప్లై ఇస్తోన్నారు. అంతర్జాతీయంగా క్రికెట్ ఆడే యూరప్ దేశాల్లో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ ఉన్నాయని గుర్తు చేశారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఒక్కసారి తిరిగితే- ఐపీఎల్ ప్రపంచంలోకి వెళ్లినట్టవుతుందని, లీసెస్టర్‌లో 75 శాతం మంది క్రికెట్‌ను ఇష్టపడతారంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications