Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈసారి IPL 2026 Opening Ceremony లేదా ? ఏం జరుగుతోంది ?

ఐపీఎల్ అంటేనే యూత్ ను ఉర్రూతలూగించే మ్యాచ్ లు, వాటి మధ్యలో డాన్సర్ల హంగామా, వీటితో పాటు ఆరంభ వేడుకలు కూడా. ఐపీఎల్ ఆరంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం ద్వారా ప్రతీ సీజన్ కూ క్రేజ్ పెంచుకుంటూ పోతున్న బీసీసీఐ.. ఈసారి కూడా అంతకు మించిన స్ధాయిలో ప్లాన్ చేస్తుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. దీనికి కారణం ఈసారి ఐపీఎల్ 2026 (IPL 2026) ఆరంభ వేడుకలు నిర్వహించకూడదని బీసీసీఐ భావిస్తుండటమే కారణం.

ఈసారి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో నిర్వహించబోతున్నారు. అయితే గతేడాది ఇదే చిన్న స్వామి స్టేడియంలో ఐపీఎల్ టైటిల్ గెల్చిన సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ నిర్వహించిన వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. సరైన ప్లాన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్సీబీతో పాటు బీసీసీఐ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి.

Will BCCI Skip the IPL 2026 Opening Ceremony New Report Suggests the Move

ఈసారి అదే చిన్నస్వామి స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్ ను నిర్వహించాల్సి వస్తోంది. ఎందుకంటే గతేడాది టైటిల్ గెల్చిన జట్టు అంటే డిఫెండింగ్ ఛాంపియన్ సొంత స్టేడియంలోనే ఆరంభ మ్యాచ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో చిన్న స్వామి స్టేడియంలో నిర్వహించే తొలి మ్యాచ్ రోజు జరగాల్సిన ఆరంభ వేడుకల్ని గతేడాది మృతులకు నివాళిగా బీసీసీఐ రద్దు చేస్తునట్లు తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌కు ముందు ఎలాంటి సంబరాలు ఉండవు. అయితే ముగింపు వేడుకలు మాత్రం యథావిథిగా ఉంటాయని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+