ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీ: మట్టి కరిచిన పాక్: దుమ్ము లేపిన బ్లాక్ క్యాప్స్

హైదరాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భాగంగా వామప్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. గువాహటిలో శ్రీలంక- బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. తిరువనంతపురంలో ఆఫ్ఘనిస్తాన్- దక్షిణాఫ్రికా మధ్య వామప్ మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ.. భారీ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే అది రద్దయింది.

మరో మ్యాచ్‌లో పాకిస్తాన్- న్యూజిలాండ్ తలపడ్డాయి. హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం జరిగిన వామప్స్‌లో పాకిస్తాన్ మట్టి కరిచింది. భారీ స్కోర్ సాధించినప్పటికీ.. మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. బౌలర్లు చేతులెత్తేసిన వేళ.. న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల వరదను పారించారు.

New Zealand defeated Pakistan

ఈ స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. ప్రారంభంలోనే ఓపెనర్లను కోల్పోయినప్పటికీ.. జట్టు కేప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. క్రీజ్‌లో పాతుకుపోయారు. జట్టుకు భారీ భాగస్వామ్యాన్ని అందించారు.

ఓపెనర్లు అబ్దుల్ షఫిక్- 14, ఇమాముల్ హక్- 1 పరుగుకే అవుట్ అయ్యారు. మిఛెల్ శాంట్నర్, మాట్ హెన్రీ.. వారిద్దరినీ పెవిలియన్ దారి పట్టించారు. తొలి వికెట్ ఆరు పరుగులకు, రెండో వికెట్ 46 పరుగులకు పడ్డాయి. మరో వికెట్ పడగొట్టడానికి న్యూజిలాండ్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది.

మూడో వికెట్ భాగస్వామ్యానికి 114 పరుగులు జోడించిన తరువాత బాబర్ ఆజమ్ అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 160 పరుగుల వద్ద ఉన్నప్పుడు శాంట్నర్ బౌలింగ్‌లో మిఛెల‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 84 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 80 పరుగులు చేశాడు బాబర్.

రిజ్వాన్ సెంచరీ బాదాడు. 103 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. సవూద్ షకీల్- 75, ఆఘా సల్మాన్- 33, షాదబ్ ఖాన్- 16, ఇఫ్తికర్ అహ్మద్-7 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లల్లో మిఛెల్ శాంట్నర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మాట్ హెన్రీ, జేమ్స్ నీషం, లోకీ ఫెర్గూసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ జట్టులో ఏకంగా ఎనిమిది మంది బౌలింగ్ చేశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. 43.4 ఓవర్లలోనే 346 పరుగులను కొట్టి అవతల పడేసింది. ఈ క్రమంలో అయిదు వికెట్లను మాత్రమే కోల్పోయిందా జట్టు. ఓపెనర్ రచిన్ రవీంద్ర- 97 పరుగులతో అదరగొట్టాడు. అతని ఇన్నింగ్‌లో ఏకంగా 16 బౌండరీలు నమోదయ్యాయి. ఒక భారీ సిక్స్ బాదాడు.

చాలా కాలం తరువాత బ్యాట్ పట్టుకున్న కేన్ విలియమ్సన్ చెలరేగాడు. 50 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 54 పరుగులు చేసి, రిటైర్డ్ నాట్ అవుట అయ్యాడు. డారిల్ మిఛెల్ 59 (రిటైర్డ్ నాటౌట్), టామ్ లాథమ్- 18, గ్లెన్ ఫిలిప్స్- 3, మార్క్ ఛాప్‌మన్- 65 (నాటౌట్), జేమ్స్ నీషమ్- 33, మిఛెల్ శాంట్నర్- 1 పరుగు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+