రైలు అప్పర్ బెర్తులో దాక్కున్న వరల్డ్ కప్ హీరో!

టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఉత్సాహంలో దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా శివం దూబే మెరుపు ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన అభిమానులు 'దూబే-దూబే' అంటూ నినాదాలు చేశారు. కానీ అదే స్టేడియంలో లక్షలాది మంది చప్పట్ల మధ్య ట్రోఫీని ముద్దాడిన వరల్డ్ కప్ హీరో.. కొన్ని గంటల వ్యవధిలోనే ఓ సామాన్యుడిలా రైలు అప్పర్ బెర్తులో ముఖం దాచుకుని ప్రయాణించాల్సి వస్తుందని ఎవరూ ఊహించి కూడా ఉండరు.

విమానాలు ఖాళీ లేక!
టీమిండియా వరల్డ్ కప్ విజయానంతరం అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే అన్ని విమానాలు ఫుల్ అయిపోయాయి. తన భార్య అంజుమ్, ఓ స్నేహితుడితో కలిసి వెంటనే ముంబై చేరుకోవాలనుకున్న శివం దూబేకు వేరే దారి లేకపోయింది. రోడ్డు మార్గంలో వెళ్లడం కంటే రైలు వేగంగా ఉంటుందని భావించిన దూబే.. తెల్లవారు 5.10 గంటలకు ఉండే సయాజీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలని నిర్ణయించుకున్నాడు.

World Cup Hero Shivam Dube Hides on Train Upper Berth to Reach Home Viral Story Explained

గుర్తుపట్టకుండా దూబే మాస్టర్ ప్లాన్
ప్రపంచ కప్ హీరో రైలెక్కితే జనం ఊరుకుంటారా.. అందుకే శివం దూబే ఓ వ్యూహాన్ని అమలు చేశాడు. తలకు క్యాప్, ముఖానికి మాస్క్, ఫుల్ స్వీవ్ టీ షర్ట్ ధరించి తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాడు. ప్లాట్ ఫారమ్ మీద రద్దీ ఎక్కువగా ఉండటంతో రైలు కదలడానికి 5 నిమిషాల ముందు వరకు కారులోనే వేచి ఉండి.. చివరి నిమిషంలో లోపలికి వెళ్లాడు. విలాసవంతమైన ఫస్ట్ క్లాస్ కాకుండా థర్డ్ ఏసీలో టికెట్ బుక్ చేసుకున్నాడు. లోపలికి వెళ్లగానే నేరుగా అప్పర్ బెర్త్ ఎక్కేసి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు.

టీటీఈకి అదిరిపోయే సమాధానం
జర్నీ మధ్యలో టికెట్ చెక్ చేయడానికి వచ్చిన టీటీఈ.. టికెట్ చూసి ఆశ్చర్యపోయాడు. "శివం దూబే? ఎవరు.. ఆ క్రికెటరా?" అని అడిగారు. పక్కనే ఉన్న దూబే భార్య అంజుమ్ వెంటనే సమయస్ఫూర్తితో.. "కాదు కాదు.. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు?" అని బదులిచ్చారు. దీంతో ఆ టీటీఈ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా దూబే గుర్తుపట్టబడకుండా జాగ్రత్తగా ప్రయాణించాడు.

పోలీస్ బందోబస్తుతో ఇంటికి..
ముంబైలోని బోరివలీ స్టేషన్ వచ్చేసరికి తెల్లారిపోగా.. అక్కడి జనం గుర్తుపడితే కష్టమని భావించి శివం దూబే పోలీసుల సాయం కోరాడు. "నేను రైలులో వస్తున్నాను అంటే పోలీసులు కూడా నమ్మలేదు. అయితే మీరు ఎయిర్పోర్టు నుంచి వస్తున్నారేమోనని అనుకున్నామని వారు ఆశ్చర్యపోయారు" అని శివం దూబే నవ్వుతూ చెప్పాడు. చివరకు పోలీసు బందోబస్తుతో స్టేషన్ నుంచి బయటపడి శివం దూబే క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+