హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యకు రెండున్నరేళ్ళేనా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్:రోశయ్య మరో రెండున్నరేళ్ళు, ఆ తర్వాత ఎన్నికల ముందు జగన్ రెండేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడానికి రాజీ ఫార్ములా కుదిరిందా? ఈ విషయం బయటికి పొక్కకపోయినా వీరప్ప మొయిలీ, కెవిపి రామచంద్రరావుల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. కానీ ఇందుకు జగన్ వర్గీయులు అంగీకరించడం లేదట. పదవిని ఎంజాయ్ చేయడానికి ఒకరు, ఎన్నికల ముందు పార్టీని గెలిపించడానికి మేమా అని వారు ఎదురు ప్రశ్నిస్తున్నట్టు చెబుతున్నారు. అసలు ఆ రాజీ ఫార్ములా నిజమా కాదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.

రోశయ్య కంటే జనంలో ముఖ్యంగా యువతరంలో జగన్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే. అయితే రాజకీయ పరిపక్వత, మానసిక పరిపక్వత విషయంలో జగన్ పై హైకమాండ్ లో అనేక అనుమానాలున్నాయి.రెండున్నర ఏళ్ళ తర్వాతైనా జగన్ పరిణతి చెందిన నాయకుడుగా మారుతాడని కాంగ్రెస్ అధిష్టానం పాజిటివ్ గా ఆలోచిస్తున్నట్తు తెలుస్తోంది.

వరదల సమయంలో రోశయ్య ప్రభుత్వం చక్కగా పనిచేసిందన్న అభిప్రాయానికి అధిష్టానవర్గం వచ్చింది. అయితే పార్టీ ఫండ్ సమకూర్చే విషయంలో రోశయ్య ప్రోయాక్టివ్ గా వ్యవహరించగలరా అన్న సందేహాలు హైకమాండ్ కు ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే వైఎస్ ఆప్తమిత్రుడైన కెవిపి రామచంద్రరావుకు హైకమాండ్ ఒక మాట చెప్పినట్టు తెలుస్తోంది. వైఎస్ హయాంలో కలెక్షన్ల విషయంలో ఆయన ఎటువంటి చొరవ తీసుకున్నారో ఇప్పుడు కూడా ఆయన రోశయ్యకు ఆ విషయంలో అండాదండగా ఉండాలి. ఈమధ్య కాలంలో కెవిపి కాంగ్రెస్ హైకమాండ్ కు, రోశయ్యకు సన్నిహితంగా నడుచుకుంటున్నారు. రోశయ్య కూడా ఒక సందర్భంలో కెవిపి అంటే కాంగ్రెస్ హై కమాండ్ కు ప్రత్యేక అభిమానం ఉండని చెప్పడం గమనార్హం.

కెవిపికి వైఎస్ మీద ఉన్నంత ప్రేమ, వాత్సల్యం జగన్ మీద లేవని కెవిపిని నమ్ముకుని బతుకుతున్న సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. జగన్ సాక్షి మీడీయాను ప్రమోట్ చేయడం కెవిపికి వ్యక్తిగతంగా ఇష్టం లేదట. మరీ అంత నష్టాలు వస్తే నిధులు సమకూర్చడం కష్టమవుతుందని ఆయన వైఎస్ చెవిలో చెప్పగా అందుకు ఆ ప్రియ మిత్రుడు అంగీకరించినట్టు సమాచారం. ఆ మీడియా గ్రూపును దాసరి నారాయణరావుకు అప్పగించి చేతులు దులుపుకుందామనుకుంటున్న దశలో వైఎస్ హఠాన్మరణం పాలయ్యారు. ఇవీ సంగతులు.. మరిన్ని విశేషాలు త్వరలో...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X