తండ్రితో నటి వనిత స్ట్రీట్ ఫైట్

విజయ్ కుమార్ చిన్న వయసులోనే వనితను సినిమాల్లోకి తీసుకు వచ్చారు. ఈ కారణంగా తన జీవితం నాశనమయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు కుటుంబాన్ని సినిమాలకు అంకితం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తనలా తన కొడుకు చిన్నతనంలోనే సినిమాలకు అంకితం కాకూడదని, తద్వారా జీవితాన్ని నాశనం చేసుకోకూడదనే తాను తన తండ్రి విజయ్‌కుమార్, తల్లి మంజులతో గొడవలకు దిగుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందులో నిజానిజాలు దేవుడికే తెలియాలి. శ్రీహరి విషయంలో తనతో తీవ్ర ఘర్షణకు దిగుతున్న విజయ్‌కుమార్ ఆయన మొదటి భార్య కొడుకు అరుణ్ విజయ్‌కుమార్‌లను వనిత మీ బండారం మొత్తం బయట పెడతానని కూడా బెదిరింపులు చేస్తున్నారు. దాంతో అప్పటికి వారు కాస్త తగ్గుతున్నప్పటికీ మళ్లీ ఘర్షణకు దిగుతున్నారు.
ఈ గొడవకు అంతా తన మొదటి భర్త ఆకాష్ కారణమని వనిత ఆరోపిస్తున్నారు. ఆకాషే తన కొడుకును తన నుండి దూరం చేయాలని చూస్తున్నారని ఆమె వాపోతున్నారు. సినీ నటుడు విజయ్‌కుమార్ రెండో భార్య అయిన మంజుల పెద్ద కూతురు వనిత. ఈమెను చిన్నతనంలోని ఇండస్ట్రీకి పరిచయం చేశారు తల్లిదండ్రులు. పద్దెనిమిది ఏళ్లకే ఆకాష్‌తో వివాహం చేశారు. శ్రీహరి పుట్టిన తర్వాత వారిద్దరికి బెడిసి కొట్టింది. ఆ తర్వాత వనిత ఆనంద్‌రాజ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తర్వాత వనిత తన కొడుకు శ్రీహరిని తనతోనే ఉంచాలని కోర్టును ఆశ్రయించింది. చైన్నై కోర్టు శ్రీహరిని తల్లి వనితతోనే ఉంచాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు తల్లికి అనుకూలంగా ఉంటే శ్రీహరి మాత్రం తల్లితో ఉండడానికి ఇష్టపడటం లేదు. తల్లి వద్ద ఉండేందుకు శ్రీహరిని ఒప్పించే పనిని కోర్టు ఆకాష్‌కు అప్పగించింది. ఏదో బిజినెస్ టూర్‌కు వెళుతూ ఆకాష్ తన కొడుకు శ్రీహరిని విజయ్‌కుమార్‌కు అప్పగించారు. శ్రీహరిని తీసుకొని విజయ్‌కుమార్ చెన్నై ఎయిర్ పోర్టుకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వనిత అక్కడికి చేరడంతో కుటుంబ గొడవలు బయటపడ్డాయి.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications