తమ్ముడిని దువ్వుతున్న చిరంజీవి

Pawan Kalyan-Chiranjeevi
రాజకీయాల్లో తనకు మద్దతు ప్రకటించాలని, అలా ముందుకు రావాలని మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను దువ్వుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెసులో చేరాలని చిరంజీవి పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేయడం పవర్ స్టార్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని అంటున్నారు. దాంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతారు. దాంతో సినిమాల్లో ఆయన బిజీ అయిపోయారు. ఒకటి తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు.

చిరంజీవి నిర్ణయానికి దాదాపుగా నాగబాబు తలొగ్గినట్లేనని భావిస్తున్నారు. కాంగ్రెసులో చిరంజీవికి చేయూత అందించడానికి ఆయన సిద్దపడినట్లు, పవన్ కళ్యాణ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. చిరంజీవికి, పవన్ కళ్యాణ్‌కు మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారట. అన్నయ్యను ముఖ్యమంత్రి పీఠంపై చూడాలన్న కోరిక నెరవేరకపోవడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర నిరాశకు గురైనట్లు చెబుతారు. అల్లు అరవింద్ తీరు వల్లనే ప్రజారాజ్యం పార్టీ ఏమీ కాకుండా పోయిందనేది కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయమట.

కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం వల్ల చిరంజీవి లక్ష్యం నెరవేరుతుందని చెప్పలేమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బట్టలూడదీసి ప్రజలు కొడతారని ఎన్నికల సమయంలో కాంగ్రెసు నాయకులనపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెసు పార్టీలో పనిచేయడం వల్ల ఇబ్బంది ఎదురవుతుందని కూడా ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+