శంకర్‌పై కెసిఆర్ మండిపాటు

K Chandrasekhar Rao
జై బోలో తెలంగాణ రెండవ భాగం తీస్తానని ఉత్సాహపడుతున్న దర్సకుడు శంకర్ తొలి భాగం విడుదల కోసం తీవ్రంగానే ఇక్కట్లను ఎక్కువగానే ఎదుర్కున్నారు. అయితే, సినిమాకు లభించిన ఆదరణ ఆయనకు కొంత ఊరటను కలిగించింది. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాత్రం శంకర్‌పై నిప్పులు చెరిగారని సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమాకు సెన్సార్ అడ్డంకులు ఏర్పడిన నేపథ్యంలో కెసిఆర్ కోసం శంకర్ ప్రత్యేకంగా సినిమాను ప్రదర్శించారు. ఆ సినిమా చూసిన తర్వాత కెసిఆర్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. సినిమా నచ్చకపోవడం వల్లనే ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారనేది అప్పుడు ప్రచారం జరిగింది. అయితే అదేమిటనేది ఎవరికీ తెలియలేదు.

సినిమాలో కెసిఆర్ రాసిన పాటను కూడా శంకర్ వాడారు. అయితే, సినిమాలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కెసిఆర్ శంకర్‌పై అలిగినట్లు సమాచారం. అంతేకాకుండా శంకర్‌పై కెసిఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారట. తిట్ల దండకం కూడా ఎత్తుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దాంతో శంకర్ తీవ్రమైన ఇరకాటంలో పడి కెసిఆర్‌ను బతిమాలుకున్నట్లు తెలుస్తోంది. శంకర్ కాళ్లావేళ్లా పడడంతో కెసిఆర్ ప్రసన్నమైనట్లు చెబుతున్నారు. ఆ తర్వాత సినిమా విడుదలైన తొలి రోజు హైదరాబాదులోని సంధ్య థియేటర్‌లో సినిమా చూసి కెసిఆర్ శంకర్‌ను ప్రశంసించారు.

కెసిఆర్ నిరాహార దీక్ష దృశ్యాన్ని సినిమాలో చూపించలేదు. కెసిఆర్ ప్రసంగాలను మాత్రం చూపించి వదిలేశారు. కెసిఆర్ ప్రాధాన్యాన్ని ఆయన వివరించలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్గాలంటున్నాయి. కాగా, సినిమా ఒక్క డాక్యుమెంటరీ లాగా ఉందని తెలంగాణకు చెందిన మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. కళాత్మక సౌందర్యం కొరవడిందనే విమర్శలు మెల్లగా ముందుకు వస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను శంకర్ క్యాష్ చేసుకోవడానికి మాత్రమే సినిమా తీశారనే విమర్సలు కూడా వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+