వరుస వివాదాల్లో పవన్‌కల్యాణ్: చిక్కుల్లో చిరంజీవి

అదేవిధంగా తమ చిత్రంలో ఏ పార్టీకి, ఏ పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా లేదని వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలను కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు. ఈ చిత్రంలో తెలంగాణకు వ్యతిరకంగా సన్నివేశాలు ఉన్నాయంటూ శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా తెలంగాణవాదులు రోడ్డెక్కారు. హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై నిప్పులు కక్కారు. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అదే సమయంలో తెలంగాణవాదులు చిరంజీవి పైనా విమర్శలు గుప్పించారు.
తెలంగాణకు చిరంజీవి రాజకీయంగా మోసం చేస్తే పవన్ కల్యాణ్ సినిమాల ద్వారా ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణవాదులు మండిపడ్డారు. చిరంజీవి సమైక్యావాదిగా ముద్రపడిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా పవన్ పెళ్లి వివాహం చిరంజీవినీ తాకింది. సినిమాలలో అభిమానులకు సూక్తులు వల్లించే చిరంజీవి మొదట తన తమ్ముడి తీరుపై స్పందించాలని ఇతర పార్టీలు ప్రశ్నించాయి.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ మెగాస్టార్ పైన తమ్ముడు పవన్ కల్యాన్ డైలాగ్‌నే ఉపయోగించింది. 2009 సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు నేతల బట్టలూడదీసి కొడతానని చెప్పిన ప్రజారాజ్యం ఇప్పుడు కాంగ్రెసులో ఎలా విలీనం అయిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. విలీనంపై స్పందించిన పలు సందర్భాలలో టిడిపి పవన్ డైలాగ్‌నే చిరు పైన ఉపయోగించడం గమనార్హం.
చిరంజీవి స్వయంగా ఎలాంటి విమర్శలు ఎదుర్కోనప్పటికీ తన సోదరుడు పవన్ కల్యాణ్, కూతురు శ్రీజ, బావమరిది అల్లు అరవింద్‌ల కారణంగా రాజకీయ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అరవింద్ టిక్కెట్లు అమ్ముకున్నారనే విమర్శలు అప్పుడు సంచలనం రేపాయి. కూతురు శ్రీజ ప్రేమ వివాహం కూడా చిరంజీవిని విమర్శించేందుకు రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్నాయి. మరోవైపు పవన్ కల్యాన్ సినిమాలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. గతంలో గబ్బర్ సింగ్, పులి సినిమాలు కూడా పోలీసుల, తెలంగాణవాదుల నుండి నిరసనలు ఎదుర్కొన్నాయి.
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
చిరంజీవికి సీనియర్ NTR సినిమాల్లో అదంటే మహా ప్రాణం.. ఎవరూ ఊహించనది -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications