2014లో బాలకృష్ణతో చిరంజీవి ఢీ!?

Chiranjeevi - Balakrishna
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణలు 2014లో ఢీకొనబోతున్నారు! ఢీకొనడం అంటే వారిద్దరూ వచ్చే సాధారణ ఎన్నికలలో ఒకే స్థానం నుండి పోటీ చేయడమో మరేదో కాదు. సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఇద్దరు బిగ్ హీరోలు నటించే సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఈ రోజు(బుధవారం) చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా తన 150వ సినిమా గురించి అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారని నేను కూడా అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని, ఈ సినిమా ఎంతో ప్రత్యేకం, అందుకే మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నానని, స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండ చేస్తానని వెల్లడించారు.

శంకర్ దాదా జిందాబాద్ తర్వాత చిరంజీవి సినిమా ఏదీ రాలేదు. రాజకీయాల్లోకి రావడం, అందులోనే బిజీగా గడిపిన నేపథ్యంలో ఆయన చిత్రాలు రాలేదు. అయితే 150వ సినిమా కోసం మాత్రం ఆయన తాపత్రయ పడుతున్నారు. అభిమానుల కోసమైనా ఆ చిత్రం చేయాలని చూస్తున్నారు. ఆరేళ్లుగా ఆయనకు సినిమాలో నటించే అవకాశం రాలేదు. అయితే 2014 సాధారణ ఎన్నికల నాటికి తన 150వ సినిమాను పక్కాగా చేయాలనే గట్టి నిర్ణయంతో చిరంజీవి ఉన్నారట.

ఆ ఎన్నికలకు ముందు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ పొలిటికల్ పిక్చర్‌తో ప్రజల ముందుకు రావాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అందుకోసం ఆయన మంచి స్క్రిప్టు కోసం వేచి చూస్తున్నారట. ఎన్నికలకు ముందు చిత్రం విడుదలయితే తనకు, కాంగ్రెసు పార్టీకి కూడా ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెసు సీనియర్ నేత వాయలార్ రవి కూడా ఇటీవల 150వ సినిమా చేయమని, అలా అయితేనే ప్రజల్లోకి బాగా వెళ్లగలమని చిరుకు సూచించిన విషయం తెలిసిందే.

మరోవైపు బాలకృష్ణ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసినట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేయాలని ఉవ్వీళ్లూరుతున్నారు. ప్రస్తుతానికి పార్టీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొంటూనే తాను నేరుగా పోటీలోకి దిగే సమయానికి రాజకీయ నేపథ్యం ఉన్న ఓ మంచి చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకు రావాలని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. అందుకోసం ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. 2014 ఎన్నికలకు ముందు చిరంజీవి, బాలకృష్ణల పొలిటికల్ చిత్రాలు దాదాపు ఒకే సమయానికి విడుదలై అభిమానులను అలరించే అవకాశాలు మెండుగానే ఉన్నాయన్నమాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+