చిరంజీవికి ప్రిన్స్ మహేష్ బాబు బూచీ?

మహేష్ బాబును తాను రాజకీయాల్లోకి తేవాలని చేస్తున్నట్లు వచ్చిన వార్తలను గల్లా అరుణ కుమారి ఖండించారు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు శేషగిరి రావు కాంగ్రెసులో మొదటి నుంచి పనిచేస్తూ వస్తున్నారు. కృష్ణ ఏలూరు నుంచి పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు. మహేష్ బాబు కుటుంబానికి కాంగ్రెసుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మహేష్ బాబు కాంగ్రెసు రాజకీయాల గురించి వార్తలు వచ్చాయి. తన కుటుంబ సభ్యులు కాంగ్రెసులో పనిచేసినంత మాత్రాన తాను రాజకీయాల్లోకి రావాలని ఏమీ లేదని, తనకు ఆ ఉద్దేశం లేదని మహేష్ బాబు స్పష్టంగానే చెప్పారు.
కాంగ్రెసులోకి వస్తే మహేష్ బాబు సేవలను తగిన విధంగా వాడుకుంటామని, మహేష్ బాబు కుటుంబ సభ్యులకు తమ కాంగ్రెసు పార్టీకి అనుబంధం ఉందని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ రంగా రెడ్డి కూడా చెప్పారు. దీన్ని బట్టి కిరణ్ కుమార్ రెడ్డి వర్గమే ఒక వ్యూహంగా మహేష్ బాబు కాంగ్రెసు రాజకీయాలను ప్రచారంలోకి తెచ్చారని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవిని బెదరగొట్టడానికి ఈ వార్తలను ప్రచారంలోకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. పైగా, తనకు కూడా ఓ బలమైన లాబీ ఉందని, తాను ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నానని ముఖ్యమంత్రి అధిష్టానానికి సంకేతాలు పంపాలని అనుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా ఓ బలమైన వర్గం ఏర్పడిన సూచనలు కనిపిస్తున్నాయి. వీరి ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసులో అంతర్గత రాజకీయాలను వేడెక్కిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications