వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా వార్: జగన్ వర్సెస్ రాధాకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-Radhakrishna
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ సాక్షి డైలీకి, వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి డైలీకి మధ్య మీడియా వార్ మరోసారి బహిరంగంగా ముందుకు వచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు రాధాకృష్ణపై వేసిన కోర్టు ధిక్కకరణ కేసు వ్యవహారం అందుకు మూలమైంది. ఈ కోర్టు ధిక్కరణ కేసు విచారణనుంచి హైకోర్టు న్యాయమూర్తి తప్పుకోవడంపై సాక్షి డైలీ బుధవారం ఓ వార్తాకథనాన్ని రాసింది. ఆ వార్తాకథనాన్ని దుమ్మెత్తిపోస్తూ ఆంధ్రజ్యోతి డైలీ గురువారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

నీతి బాహ్యమైన రిపోర్టింగ్ అంటూ శీర్షిక పెట్టి హైకోర్టు సాక్షిగా జగన్ వక్రీకరణలు, న్యాయమూర్తి వ్యాఖ్యలకు సొంత జోడింపులు, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండిపై కోర్టు ధిక్కరణ కేసులో చలువలు పలువలు,, అసలు తీర్పునే సవాల్ చేయని ఎబిఎన్, నాట్ బిఫోర్ నాటకాలతో మాకేం పని అంటూ వ్యాఖ్యలను జోడించింది.

ఎందుకీ నీతిబాహ్యమైన పనులు అని శీర్షిక పెట్టి బుధవారం సాక్షి ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. హైకోర్టు న్యాయమూర్తి నూతి రామమోహన్ రావు ఎబిఎన్ ఎండి రాధాకృష్ణపై ఫలానా విధంగా మండిపడ్డారని, ఎండగట్టారు అంటూ సాక్షి వార్తకథాన్ని ప్రచురించిందని ఆంధ్రజ్యోతి డైలీ వ్యాఖ్యానించింది. న్యాయమూర్తి చెప్పిన విషయాలను యధాతథంగా ఇవ్వకుండా సాక్షి సొంత వ్యాఖ్యలను జోడించిందని మండిపడింది. న్యాయమూర్తి వ్యాఖ్యలనే సాక్షి వక్రీకరించిందని ఆరోపించింది.

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తరఫున కృష్ణారావు అనే న్యాయవాది వకాలత్ దాఖలు చేశారు. గతంలో కృష్ణారావు నూతి రామ్మోహన్ రావు వద్ద జూనియర్‌గా పనిచేశారు. దీంతో మీరేందుకు వచ్చారు, మీక పిటిషన్ ఎలా వచ్చిందని న్యాయమూర్తి న్యాయవాదిని అడిగారు. తన కజిన్ రెఫరెన్స్ ద్వారా కేసు తనకు వచ్చిందని కృష్ణారావు చెప్పారు. ఈ సందర్భంగానే రామ్మోహన్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు.

"ఈ డిజైన్ అంతా ఎందుకు, నేను రెస్పాండెంట్‌కు తెలుసు. నాకు రెస్పాండెంట్ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు బి హియర్ దిస్ కేసు" అని చెప్పి కేసును మరో న్యాయమూర్తికి అప్పగించాలని కోరుతూ యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌కు రామ్మోహన్ రావు రెఫర్ చేశారు. దీనికి సాక్షి దినపత్రిక సొంత వ్యాఖ్యలు జోడించిందని ఆంధ్రజ్యోతి తిట్టిపోసింది. నాట్ బిఫోర్‌లతో వ్యవస్థను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారంటూ న్యాయమూర్తి ఆవేదనతో ప్రశ్నించారని, ఇటువంటి చర్యలు వ్యవస్థకు ఏ మాత్రం మేలు చేసేవి కావని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు తప్పుగా రాసిందని విమర్శించింది.

ఇంకా మరికొన్ని వ్యాఖ్యలు కూడా సాక్షి దినపత్రిక చేసిందని వాటిని క్రోడీకరిస్తూ ఆంధ్రజ్యోతి డైలీ ఎవరిది నీతి బాహ్యత అంటూ విమర్శించి, ఎందుకీ ధిక్కరణ అంటూ వివరణ ఇచ్చింది. మొత్తం మీద వైయస జగన్‌కు, రాధాకృష్ణకు మధ్య ఉన్ప వైరం మరోసారి బయటపడింది.

English summary
Once again media war between Sakshi daily owner and YSR Congress party president YS Jagan and ABN Andhrajyothy MD Vemuri Radhakrishna rocked with news reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X