• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హేట్ స్పీచ్: అక్బరుద్దీన్ చరిత్ర పెద్దదే..

By Pratap
|
Akbaruddin Owaisi
హైదరాబాద్‌: కర్మ కాలి బయటపడ్డాడు గానీ మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ద్వేషపూరిత ప్రసంగాలకు పెట్టింది పేరనే వార్తలు వస్తున్నాయి. ఫేస్‌బుక్, ఇంటర్నెట్, యూట్యూబ్ వంటి సామాజిక మీడియా వల్ల అక్బరుద్దీన్ విశ్వరూపం బయటపడిందని అంటున్నారు. క్రిస్ట్మస్ సెలవు దినాలకు లండన్ వెళ్లిన అక్బరుద్దీన్‌కు తన నిర్మల్ ప్రసంగం ఎటు దారి తీస్తుందనే విషయం తెలిసి ఉండకపోవచ్చు. అతని ప్రసంగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన తీరుపై ముస్లిం ప్రముఖుల నుంచి, సంస్థల నుంచి కూడా వ్యక్తమవుతోంది.

అయితే, అక్బరుద్దీన్ కొత్తగా ఏమీ చెప్పలేదని మీడియా వ్యాఖ్యానిస్తోంది. చాలా కాలంగా ఆయన అటువంటి ప్రసంగాలు చేస్తున్నారని ఓ ఆంగ్ల పత్రిక వ్యాఖ్యానించింది. తాను చేసిన ప్రసంగానికి తప్పు చేశానని అక్బరుద్దీన్ అంగీకరిస్తారని అనుకుంటే పొరపాటే అనే మాట కూడా వినిపిస్తోంది. రాజకీయంగా సుల్తాన్‌గా పేరు గడించిన సలావుద్దీన్ ఓవైసీకి 1970లో అక్బరుద్దీన్ జన్మించాడు. పదో తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత హిమాయత్ నగర్‌లోని సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం గుల్బర్గాలో మెడిసిన్ చదవడానికి వెళ్లిపోయారు.

కుటుంబ సభ్యుల నుంచి పిలుపు రావడంతో ఆయన 1992 -93లో మెడిసిన్‌కు మధ్యలో స్వస్తి చెప్పి హైదరాబాద్ వచ్చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే, ఆయన క్రైస్తవ బాలిక ప్రేమలో పడి తండ్రి సలావుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించినప్పటికీ ఆమెను 1995లో పెళ్లి చేసుకున్నారు. ఆమె సబీనా ఫర్జానా పేరుతో కొత్త జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు సలావుద్దీన్ కుటుంబానికి దూరంగా అతను ఉండాల్సి వచ్చింది.

సలావుద్దీన్ ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో అక్బరుద్దీన్ మళ్లీ తన కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చారు. చంద్రాయణగుట్ట శాసనసభా నియోజకవర్గంలో సలావుద్దీన్ ఓవైసీ తన ప్రత్యర్థి అమానుల్లాఖాన్‌ను ఎదుర్కోవడానికి అక్బరుద్దీన్‌ను రంగంలోకి దించారు. 1999 ఎన్నికల్లో అమానుల్లా ఖాన్‌ను ఓడించడంతో అక్బరుద్దీన్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు.

అక్బరుద్దీన్ ప్రసంగాలు ఎప్పుడూ రెచ్చగొట్టే విధంగానే ఉంటూ వచ్చాయని అంటారు. లాల్ దర్వాజాను హరా దర్వాజాగా మార్చేస్తానని చెబుతూ వచ్చేవారని మీడియాలో వార్తలు వచ్చాయి. లాల్ దర్వాజా నరేంద్ర వంటి బిజెపి నాయకులకు పెట్టని కోటగా ఉంటూ వచ్చింది. హైదరాబాదుకు వస్తే చంపేస్తామని ప్రముఖ రచయితలు సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్‌లకు అక్బర్ ఫత్వా జారీ చేశారు. అక్బరుద్దీన్‌పై ప్రత్యర్థి మొహమ్మద్ పెహల్వాన్ 2011లో హత్యాప్రయత్నం చేశారు. దాని నుంచి అక్బరుద్దీన్ బయటపడ్డారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
According to media reports - or what Akbaruddin said was nothing new. He has been making such 'hate' speeches for several years and it's just that this time it became scandalous, thanks to the rising power of the Internet and social networks like YouTube and Facebook. "If you think he would be apologetic, you are terribly mistaken," said a source who claimed to know him for two decades.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more