సంపన్నుల జాబితాలో మావో మనువరాలు

విఖ్యాత కమ్యూనిస్టు నేత, పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ వ్యవస్థాపకులు మావో జెడాంగ్ మనుమరాలు కాంగ్ డోంగ్‌మయి చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకుంది! ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. చైనాలో వ్యక్తిగత ఆస్తి నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన నేత మావో జెడాంగ్. ఇప్పుడు పెద్దఎత్తున ఆస్తులు కూడబెట్టిన కుటుంబాల్లో ఆయనదీ ఒకటి కావడం గమనార్హం.

చైనా సంపన్న కుటుంబాల జాబితాలో మావో మనవరాలు, మనవడు(ఆమె భర్త) సైతం చేరిపోయారు. మావో మూడో భార్య, అమ్మమ్మ హె జెజిన్‌తో కలిసి ఉంటున్న కాంగ్ డొంగ్‌మెయి, ఆమె భర్త చెన్ డొంగ్‌షెంగ్‌ల ఆస్తుల విలువ రూ.4,425 కోట్లుగా తేలింది. ఈ జాబితాను 'న్యూ ఫార్చ్యూన్' పత్రిక ప్రకటించగా కాంగ్ దంపతులు 242వ స్థానంలో నిలిచారు.

Kong Dongmei

హె జెనిన్‌కు ఆరుగురు సంతానం. చైనా విప్లవంలో భర్తతో పాటు ఆమె చివరి వరకు పాల్గొన్నారు. ఈ క్రమంలో పిల్లల్లో చాలామంది చనిపోగా మిగిలినవారిలో ఒకరి సంతానమే కాంగ్. అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ నుంచి కాంగ్ మాస్టర్ డిగ్రీ పొందారు. జాతీయ వేలం సంస్థ గార్డియన్‌కు ఆమె వ్యవస్థాపక అధ్యక్షురాలు. దేశంలోనే నాలుగో అతిపెద్ద జీవిత బీమా సంస్థ 'తైకంగ్' నిర్వాహకురాలు.

కాంగ్ డోంగ్‌మయి, చెన్ డొంగ్‌షెంగ్‌ల ఉమ్మడి సంపద రూ.4,425 కోట్లుగా ఉన్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రిక వెల్లడించింది. 1999లో పెన్సెల్వేనియా యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ సాధించిన కాంగ్.. బీజింగులో ఓ సాంస్కృతిక సంస్థతో పాటు అనుబంధంగా బుక్ హౌస్‌ను నిర్వహిస్తున్నారు.

అవి సామ్యవాద సంస్కృతి పరిరక్షణ లక్ష్యంతో పని చేస్తున్నాయి. అంతేకాదు మావోపై కాంగ్ రచించిన నాలుగు పుస్తకాలు అత్యధికంగా అమ్ముడుపోయాయి. అందుకే కాంగ్ తన తాత మావో పేరునే మూలధనంగా మార్చుకున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+