Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తౌఫిక్‌పై వ్యాఖ్యలు: సైనాపై జ్వాలా గుత్తా నిప్పులు

Saina Nehwal lashes out at Taufik Hidayat, Jwala unhappy
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ వేలం వివాదం రోజురోజుకూ ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల మధ్య కూడా విభేదాలు పొడసూపుతున్నాయి. ఆటగాళ్ల వేలాన్ని చెత్త ప్రక్రియగా అభివర్ణిస్తూ తాను ఇకపై వేలానికి అందుబాటులో ఉండబోనని ఇండోనేసియా గ్రేట్ తౌఫిక్ హిదాయత్ మండిపడ్డాడు. ఆ వ్యాఖ్యలపై వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. అతని వ్యాఖ్యలను సైనా నెహ్వాల్ వ్యతిరేకించింది. సైనా, తౌఫిక్‌లిద్దరూ ఐబీఎల్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో వివాదం కొత్త మలుపు తిరిగే అవాకశం కనిపిస్తోంది.

విదేశీ ఆటగాళ్లకు తగిన ధర లభించకపోవడంపై తౌఫిక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రిటైరయిన ఆటగాడు ఎక్కువ ధరకు అమ్ముడుబోడని, వారికిదే పెద్ద మొత్తమంటూ సైనా తాఫిక్‌కు కౌంటర్ ఇచ్చింది. సైనా నెహ్వాల్ వ్యాఖ్యలపై జ్వాలా గుత్తు నిప్పులు చెరిగింది. తౌఫిక్ వ్యాఖ్యలపై సైనా స్పందించడం సరి కాదని జ్వాలా గుత్తా ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది.

ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో తౌఫిక్ ఒకడని, తౌఫిక్ అభిప్రాయాల్ని వ్యతిరేకించడం సైనాకు తగదని ఆమె అన్నది. ఆట ద్వారా నీవెంత సంపాదిస్తావన్నది ముఖ్యం కాదని, సహచర ఆటగాళ్ల అభిప్రాయాల్ని అర్థం చేసుకోవాలని సూచించింది. తౌఫిక్ గురించి ఇలా ఎవరైనా మాట్లాడుతారని తాను ఊహించలేదని, ఇది బాధాకరమని, వారిని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించవద్దని జ్వాలా ట్వీట్ చేసింది.

బ్యాడ్మింటన్‌లో హిదాయత్ సాధించిన విజయాలు ఎవరికీ సాధ్యం కాదని జ్వాలా అంది. అది డబ్బుకు సంబంధించిన వ్యవహారం కాదని, గౌరవానికి సంబంధించిందని ఆమె వ్యాఖ్యానించింది. ఎవరైనా తమ సహచర క్రీడాకారుల అభిప్రాయాల్ని గౌరవించాలని సూచించింది. నీకిష్టం లేకపోతే అతనితో ఏకభవించవద్దని, కానీ చులకనగా మాట్లాడవద్దని, అది సంస్కారమవుతుందని హితబోధ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+