వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెటిఆర్ బస్సు పరిశీలన, లోకేష్ పరామర్శ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో కల్వర్టును ఓ బస్సు ఢీకొనడంతో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సహా ఆరేడు మంది బతికి బయటపడ్డారు. ప్రమాదంలో బయటపడ్డ వారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చాలా మృతదేహాలు గుర్తుపట్ట లేనివిధంగా కాలిపోవడంతో డిఎన్ఏ పరీక్షల ద్వారానే గుర్తించే వీలుందంటున్నారు. పరీక్షల నిమిత్తం మృతదేహాల నుండి నమూనాలను సేకరించారు. డిఎన్ఏ రిపోర్టు కోసం మూడు నుండి నాలుగు రోజులు పట్టవచ్చునని చెబుతున్నారు.

కాగా, బెంగళూరు నుండి హైదరాబాదుకు 578 కిలోమీటర్లు దూరం ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున పాలెం వద్ద బస్సు ప్రమాదం జరిగిన చోటు 466 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు మనంగళవారం రాత్రి 11 గంటలకు బెంగళూరు సిటీని దాడి పాలెం వద్ద ప్రమాదానికి గురైనప్పుడు ఉదయం ఐదు గంటలు. అంటే ఆరు గంటల్లోనే బస్సు 466 కిలోమీటర్లు ప్రయాణించింది.

ప్రమాదం 1

ప్రమాదం 1

మహబూబ్ నగర్ జిల్లాలో కల్వర్టును ఢీకొని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తున్న తెరాస శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు.

ప్రమాదం 2

ప్రమాదం 2

మహబూబ్ నగర్ జిల్లాలో కల్వర్టును ఢీకొని 45 మంది మృతి చెందిన ప్రమాద ఘటన ప్రాంతంలో సహాయ చర్యలు చేపడుతున్న సిబ్బంది దృశ్యం.

ప్రమాదం 3

ప్రమాదం 3

వోల్వో బస్సుకు సంబంధించిన డిజిల్ ట్యాకర్ పగిలి పోయింది. ట్యాంకర్ పగిలిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు నిద్రలో ఉండడం, క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.

ప్రమాదం 4

ప్రమాదం 4

మంటలు ఎగిసిపడిన సమయంలో బస్సులో నుండి ఐదుగురు ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్‌లు బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు దూకారు. డ్రైవర్, క్టీనర్ పారిపోయి అడ్డాకుల పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.

ప్రమాదం 5

ప్రమాదం 5

బస్సులో మొత్తం 52మంది ఉండగా అందులో ప్రయాణికులు 50 మంది, డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ప్రయాణికుల్లో 45 మంది మృత్యువాత పడ్డారు.

ప్రమాదం 6

ప్రమాదం 6

మంగళవారం రాత్రి 11 గంటలకు బెంగుళూరు నుండి బయలు దేరిన వోల్వో బస్సు బుధవారం తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో 39 మంది పురుషులు, ఐదు మంది మహిళలు, ఓ చిన్నారి మృత్యువాత పడ్డారు.

ప్రమాదం 7

ప్రమాదం 7

బస్సులో ఏసికి ఉపయోగపడే నియోగ్యాస్ వల్ల వెంటనే మంటలు వ్యాపించాయి. దీంతో బస్సుకు త్వరగా మంటలు అంటుకొని దగ్ధమయ్యింది.

ప్రమాదం 8

ప్రమాదం 8

ప్రయాణికులు నిద్రిస్తుండటంతో కూర్చున్నవారు కూర్చున్నట్లుగానే సీట్లలో కాలి బూడిదై ఎముకలతో కూడిన మాంసపు ముద్దలు పడి ఉన్నాయి.

ప్రమాదం 9

ప్రమాదం 9

వోల్వో బస్సులో దీపావళికి ఉపయోగించే టపాసులు, విద్యుత్ సామాగ్రి ఉండటంతో ఈ అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయిందంటున్నారు.

ప్రమాదం 10

ప్రమాదం 10

డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు కొంతదూరం రోడ్డుపై దూసుకెళ్లగా డీజిల్ ట్యాంకు పగిలి బస్సు వెంటే డీజిల్ కారిపోయింది, దీంతో మంటలు కూడా డీజిల్ వెంట వెళ్లి బస్సుకు తగిలాయి.

ప్రమాదం 11

ప్రమాదం 11

ఓ పక్క డీజిల్ ట్యాంకర్ వద్ద మంటలు, మరోపక్క రోడ్డుపై మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో ఆప్రాంతమంతా ఏంజరిగిందో తెలుసుకునే లోపే ప్రయాణికులు బస్సులో కాలి బూడిదయ్యారు.

ప్రమాదం 13

ప్రమాదం 13

కాస్త అటూ ఇటుగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో సుమారు ఐదు అడుగుల ఎత్తున్న కల్వర్టు గోడను రాసుకుంటూ బస్సు ముందుకు పోయింది.

ప్రమాదం 14

ప్రమాదం 14

తాకిడి త్రీవతకు వోల్వో బస్సు ముందు భాగంలో, డ్రైవర్ సీటుకు వెనుక వైపున ఉండే ఇంధన ట్యాంకు బద్ధలైంది. దీంతో నిప్పు రాజుకుంది.

ప్రమాదం 15

ప్రమాదం 15

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం 16

ప్రమాదం 16

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఓ బాధితుడికి పరామర్శ.

ప్రమాదం 17

ప్రమాదం 17

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. బాధితుడికి పరామర్శ.

ప్రమాదం 18

ప్రమాదం 18

పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. బాధితుడికి పరామర్శ దృశ్యం.

ప్రమాదం 19

ప్రమాదం 19

పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులను హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో పరామర్శించిన అనంతరం మాట్లాడుతున్న లోకేష్.

ప్రమాదం 20

ప్రమాదం 20

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న జైసింగ్.

ప్రమాదం 21

ప్రమాదం 21

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న మంజుర్ పాషా.

ప్రమాదం 22

ప్రమాదం 22

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న జైసింగ్ దృశ్యం.

ప్రమాదం 23

ప్రమాదం 23

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అంబులెన్సులోకి మజర్ పాషాను ఎక్కిస్తున్న దృశ్యం.

ప్రమాదం 24

ప్రమాదం 24

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న రాజేష్.

ప్రమాదం 25

ప్రమాదం 25

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. శ్రీకర్‌ను స్ట్రెచర్‌లో ఆసుపత్రిలోకి తరలిస్తున్న దృశ్యం.

ప్రమాదం 26

ప్రమాదం 26

మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులు హైదరాబాదులోని డిఆర్‌డివో ఆపొలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. యోగేష్ గౌడను స్ట్రెచర్‌లో ఆసుపత్రిలోకి తరలిస్తున్న దృశ్యం.

English summary
In one of the worst-ever road accidents in the recent past in Andhra Pradesh, 45 people, including an infant, were burnt to death when a luxury bus run by a private travel agency caught fire after hitting a culvert on the Bangalore-Hyderabad national highway here at 5.00 am on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X