హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాకు చేతకాదన్నారుగా, చూడండి: ఈటెల (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమకు పాలనే చేతకాదని ఎగతాళి చేశారని, కానీ మిషన్ కాకతీయ పథకంతో తెలంగాణ సత్తా చాటామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం అన్నారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన మిషన్ కాకతీయ - సమాలోచన సదస్సుకు ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు ఆగినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. అ్నదాతలు సంతోషంగా ఉండాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన పథకం మిషన్ కాకతీయ అని చెప్పారు.

ఇలాంటి గొప్ప పథకం అమలులో ఆర్థిక శాఖ పెద్దన్న పాత్రను పోషిస్తుందని, అవసరమైన నిధులను ఇస్తుందన్నారు. మిషన్ కాకతీయ పథకం అమలులో ఇంజినీర్లది కీలక పాత్ర అని చెప్పారు. మంత్రులకు సండే లేదు మండే లేదు.. ప్రతిరోజు మాకు పని రోజే అన్నారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ మొదటి దశ పనులను విజయవంతంగా పూర్తి చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ దశలో మొత్తం 8222 చెరువులకు టెండర్లు పిలిచామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రెండో దశకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్ామన్నారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

కాగా, తొలి విడతలో తక్కువ సమయం ఉన్నా పూర్తి సన్నద్ధత లేకపోయినప్పటికీ, విజయవంతంగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయిన తెలంగాణ నీటిపారుదల శాఖ రెండో విడతకు సర్వసన్నద్ధమైంది.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

మొదటి దశ అనుభవాలు, ఇంతకాలంపాటు సరిదిద్దుకున్న లోటుపాట్లు, అంతకుమించి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రశంసల వెల్లువ.. వెరసి రెట్టించిన ఉత్సాహంతో రెండో దశ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ మొదటి దశలో... 46,531 చెరువులు గుర్తించారు. ఏడున్నర వేలకు పైగా చెరువుల్లో పనులు మొదలు పెట్టారు. పదమూడు వందలకు పైగా చెరువుల్లో పనులు పూర్తయ్యాయి. తొలి విడత చేసిన పనుల విలువ రూ.607 కోట్లు.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

రెండో దశ ప్రణాళికలో.. తొమ్మిది జిల్లాల్లో తొమ్మిదిన్నర వేల చెరువులు ఎంపిక చేశారు. మొదటి దశలో ఇంకా మొదలు కానివి 769 ఉన్నాయి. దీంతో, రెండో దశ కింద పనులు పూర్తి చేయాల్సిన చెరువులు 10,355 ఉన్నాయి.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ

మంత్రి హరీష్ రావు సోమవారం నాడు ఇంజినీర్లతో మిషన్ కాకతీయ పైన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లు పలు సూచనలు చేశారు.

కెటిఆర్

కెటిఆర్

టీహబ్ రెండో దశను మూడేండ్లలో పూర్తిచేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్ వేరుగా తెలిపారు. రూ.150 కోట్ల ఖర్చుతో మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ రెండో ఫేజ్ ఉంటుందని వివరించారు. కేటీఆర్ సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. టీ హబ్ రెండో దశకోసం వివిధ రకాల ప్రతిపాదనలు తమ ముందున్నాయని, పీపీపీ విధానంలో రెండో దశను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రెండో దశకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.

కెటిఆర్

కెటిఆర్

టీహబ్‌కు సహకరించాలని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన మీడియా ల్యాబ్స్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్(హ్యూస్టన్)లతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని కెటిఆర్ తెలిపారు. టీహబ్‌కు ప్రభుత్వం రూ.10 కోట్ల మూల నిధిని సమకూర్చిందని, దశల వారీగా ఈ నిధిని 100 మిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నామని పేర్కొన్నారు. టీ హబ్‌తో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ), ఐఐఐటీ, నల్సార్‌లు భాగస్వామ్యం భాగస్వామ్యం పంచుకున్నాయన్నారు.

English summary
Telangana Government Launches Mission Kakatiya Phase-II Work
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X