వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీతావహం: 1993నాటి ముంబై వరుస పేలుళ్లు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై వరుస పేలుళ్ల ఘటన భారత్‌పై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి. ఇది 1993 మార్చి 12న జరిగిన నెత్తుటి చరిత్ర. బాంబు పేలుళ్లలో 257 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు.

వరుస పేలుళ్ల ఘటన భారత భూభాగంపై జరిగిన మొదటి అతిపెద్ద ఘటనే కాకుండా అత్యంత ప్రమాదకరమైన ఆర్‌డిఎక్స్‌ను పేలుళ్లలో వాడారు. కాగా, ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడైన యాకుబ్ మెమన్‌ను గత గురువారం ఉదయం ఉరితీశారు.

1993, మార్చి 12 జరిగిన బాంబు పేలుళ్ల వివరాలు:

1. మార్చి 12 మధ్యాహ్నం 1.30: బాంబే స్టాక్స్ ఎక్స్ఛేంచ్ భవనం వద్ద భారీ పేలుడు. 84 మంది మృతి. 217 మందికి గాయాలు.

2. మధ్యాహ్నం 2.15: నార్సీనాథ్ వీధిలోని, కతాబజార్ వద్ద పేలుళ్లు. నలుగురు మృతి. 16 మందికి గాయాలు.

3. మధ్యాహ్నం 2.30: శివసేన భవన్ వద్ద పెట్రోల్ పంపువద్ద మరోపేలుడు. నలుగురు మృతి. 50 మందికి తీవ్ర గాయాలు.

4. మధ్యాహ్నం 2.33: నారిమన్ పాయింట్ వద్ద ఆకాశవాణి భవనం వద్ద పేలుడు. 20 మంది మృతి. 87 మందికి గాయాలు.

5. మధ్యాహ్నం 2.45: మహిమ్‌లోని ఫిషర్‌మెన్ కాలనీ వద్ద పేలుళ్లు. ముగ్గురు మృతి. ఆరుగురికి గాయాలు.

6. మధ్యాహ్నం 2.45: వరోలీలోని సెంచరీ బజార్‌లో భారీ పేలుళ్లు. 113 మంది మృతి. 227 మందికి గాయాలు.

7. మధ్యాహ్నం 3.05: జవేరీ బజార్ వద్ద పేలుళ్లు. 17 మంది మృతి. 57 మందికి గాయాలు.

8. మధ్యాహ్నం 3.10: బంద్రాలోని సీరాక్ హోటల్ వద్ద పేలుళ్లు. 17 మంది మృతి. 57 మందికి గాయాలు.

9. మధ్యాహ్నం 3.13: దాదర్‌లోని ప్లాజా సినీమా వద్ద పేలుళ్లు. 10 మంది మృతి, 37 మందికి గాయాలు.

10. మధ్యాహ్నం 3.20: జూహూ సెంచూర్ హోటల్ వద్ద మరో పేలుడు. ముగ్గురికి తీవ్ర గాయాలు.

11. మధ్యాహ్నం 3.30: సహారా ఎయిర్‌పోర్టు విన్సిటీ వద్ద పేలుళ్లు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.

12. మధ్యాహ్నం 3.40: హోటల్ ఎయిర్‌పోర్టు సెంచూర్ వద్ద జరిగిన పేలుళ్లలో ఇద్దరు మృతి చెందగా... ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మొత్తం 13 వరుస బాంబు పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 700మందికిపైగా ప్రజలు గాయాలపాలయ్యారు.

English summary
India has executed Yakub Memon, the man convicted of financing the deadly 1993 Mumbai bombings. Columnist Bachi Karkaria reflects on how the bombings changed India's financial and entertainment capital forever.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X