జగన్ పార్టీ షాక్: టిడిపిలోకే జెసి బ్రదర్స్?

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు సమాచారం. దివాకరరెడ్డి కుటుంబం తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్‌తో విభేదిస్తున్న దివాకర్ రెడ్డి ఒక దశలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు దృష్టి సారించారు. అయితే, స్థానిక రాజకీయాల కారణంగా ప్రస్తుతం తెలుగుదేశం పట్ల ఆసక్తి ప్రదర్సిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా దివాకరరెడ్డి సోదరుడు ప్రభాకరరెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడి తమ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం మొదలైన తర్వాత జెసి కుటుంబసభ్యులు చంద్రబాబుతో మాట్లాడటం ఇదే మొదటిసారి. తెలుగుదేశంలోకి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయన చంద్రబాబుతో మాట్లాడారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రభాకరరెడ్డి ఆసక్తిగా ఉన్నారు.

JC Diwakar Reddy

మరోవైపు జెసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్‌ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి నుంచి శాసనసభకు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన కుటుంబానికి జగన్ పార్టీలో చోటు దక్కదని స్పష్టం కావడంతో ఆయన కూడా తెలుగుదేశం వైపు ఆసక్తిగా ఉన్నారు. పవన్, ప్రభాకర్‌రెడ్డిలో ఒకరికి లోక్‌సభ, మరొకరికి శాసనసభ టికెట్లును కోరుతున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మధ్యవర్తిత్వం నెరుపుతున్నారు. సంక్రాంతి పండగ తర్వాత మంచిరోజులు ఉండటంతో అప్పుడే పార్టీలో చేరే అంశంపై నిర్ణయం ప్రకటించాలని జెసి కుటుంబం భావిస్తునట్లు సమాచారం. కాగా, జేసీ కుటుంబం రాకపై అనంతపురం జిల్లాలో పరిటాల రవి సతీమణి సునీత ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పరిటాల కుటుంబంతో కూడా మాట్లాడి ఇరుపక్షాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పే బాధ్యతని సోమిరెడ్డి తీసుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా అనంతపురం జిల్లాలో పార్టీ నేతలందరితో మాట్లాడి అందరి ఆమోదంతోనే అడుగు ముందుకు వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆ జిల్లా నేతలను చంద్రబాబు పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+