వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు అలా-నేడు ఇలా: 10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈయనే, ఆసక్తికరాంశాలు

ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మోరార్జీ దేశాయి ఎక్కువసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం(ఫిబ్రవరి 1న) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేవ పెడుతున్న నేపథ్యంలో భారత బడ్జెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఏర్పడింది. తొలిసారి నెల ముందే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కేంద్రం సంచలనం సృష్టించింది. అంతేగాక, సాధారణ బడ్జెట్ తోపాటు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం మరో విశేషం. 92ఏళ్ల సాంప్రదాయానికి స్వస్తి పలికి తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాక, ఇక ముందు కూడా ఇలానే జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

స్వాతంత్ర్యం రాకముందు..

1860 ఏప్రిల్ నెలలో తొలిసారి భారత బడ్జెట్ ను జేమ్స్ విల్సన్ ప్రవేశ పెట్టారు. అప్పుడు విల్సన్ ఇండియన్ కౌన్సిల్ కు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.

స్వాతంత్య్రానంతరం తొలి బడ్జెట్

మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం ఆర్కే షణ్ముగం శెట్టి మొదటి బడ్జెట్ ను సభ ముందుకు తెచ్చారు. 1947 నవంబర్‌లో ఆయన తొలి దేశీయ ఆర్థిక మంత్రి కావడం గమనార్హం. 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకున్న కాలాన్ని ఈ బడ్జెట్ కవర్ చేసింది. ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్ చదవని తొలి మంత్రి

శెట్టి తర్వాత 1949-50లో జాన్ మతాయి ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత సాదాసీదా బడ్జెట్‌గా పేరుగాంచింది. బడ్జెట్‌ను చదవకూడదని నిర్ణయించిన ఆయన.. అన్ని వివరాలను వైట్ పేపర్లలో సర్క్యూలేట్ చేస్తున్నట్లు సభ్యులకు తెలిపారు.

పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ఆయనే

ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మోరార్జీ దేశాయి ఎక్కువసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గరిష్టంగా 10సార్లు ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టడం గమనార్హం. 1964, 1968 సంవత్సరాల్లో రెండుసార్లు ఆయన జన్మదిన రోజే బడ్జెట్ ను తీసుకురావడం విశేషం. ఫిబ్రవరి 29న పుట్టిన రోజు.

Morarji desai introduced budget at 10 times

బ్లాక్ బడ్జెట్

రూ.550 కోట్ల లోటు కారణంగా 1973-74 కాలంలో తీసుకొచ్చిన బడ్జెట్ కు బ్లాక్ బడ్జెట్ గా పేరు వచ్చింది. దీన్ని మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రవేశపెట్టారు.

బడ్జెట్ ప్రవేవపెట్టి.. రాస్ట్రపతులయ్యారు

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్‌లు మాత్రమే ఆర్థికమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం వీరు రాష్ట్రపతులయ్యారు.

క్లిష్ట పరిస్థితి

క్లిష్ట సమయంలో రెండు ప్రభుత్వ హయాంలలో యశ్వంత్ సిన్హా ఐదు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. పోఖ్రాన్ రెండవ పేలుళ్ల అనంతరం 1999లో, కార్గిల్ యుద్ధం అనంతరం 2000లలో, గుజరాత్‌లో అత్యంత భీకరమైన భూకంపం అనంతరం 2001లో, ఫారెక్స్ సంక్షోభ సమయం 1991లో యశంత్ సిన్హా బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఒకే ఒక్క మహిళ

ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క మహిళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశాయ్ రాజీనామా చేయడంతో దివంగత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న 1970-71 సమయంలో ఆమె బడ్జెట్ ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు.

రెండు బడ్జెట్ ల విడిపోయిన కాలం: మళ్లీ కలిసిందిప్పుడే

1924లో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ నుంచి విడదీశారు. అప్పటి నుంచి రెండు బడ్జెట్ లు విడివిడిగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఆ 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి , ప్రస్తుతం రెండు బడ్జెట్లను కలిపి మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.

బడ్జెట్ ప్రవేశపెట్టిన ముగ్గురు ప్రధానులు:

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేస్తూనే బడ్జెట్ తీసుకొచ్చారు.

అతిపెద్ద బడ్జెట్

1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అతిపెద్ద బడ్జెట్ గా పేరు. అదేసమయంలో దేశీయ ఆర్థిక విధానాలన్నింటిల్లో పూర్తి మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దీన్ని ప్రవేశపెట్టారు.

బడ్జెట్ సమయంలో మార్పులు చేసిన వాజ్‌పాయి

అంతకుముందు వరకు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేవారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం అటల్ బిహార్ వాజ్ పేయి కాలం 1999లో బడ్జెట్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు తీసుకొచ్చారు. ఆ బడ్జెట్ ను యశ్వంత్ సిన్హానే ప్రవేశపెట్టారు.

ఒక్కో బడ్జెట్ కాపీ ఖర్చెంతో తెలుసా?

బుధవారం ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కాపీల వివరాల్లోకి వెళితే.. జనవరి 19న ప్రారంభమైన హల్వా సెర్మనీతో ఈ బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ మొదలైంది. ఎంతో పకడ్బందీగా జరిగిన ఈ ప్రతుల ప్రింటింగ్, మొత్తం 788 బడ్జెట్ కాపీలను ముద్రించినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో కాపీని ముద్రించడానికి రూ.3450 ఖర్చు అయిందని తెలిసింది.

పార్లమెంట్ లోని ఎంపీలకు, పలువురు అధికారులకు మాత్రమే బడ్జెట్ ప్రతులను అందించనున్నారు. బయటి వ్యక్తులకు మాత్రం డిజిటల్ ప్రతులనే పంపనున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

English summary
Former PM Morarji desai introduced budget at 10 times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X