టిడిపి: తెలంగాణకు నారా లోకేష్, ఆంధ్రకు బాలయ్య?

Nara Lokesh for Telangana: Balayya for Andhra
హైదరాబాద్: రెండు రాష్ట్రాల ఏర్పాటు తర్వాత అనుసరించాల్సిన వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో నారా లోకేష్, సీమాంధ్ర బాలయ్య పార్టీకి పెద్ద దిక్కుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే చంద్రబాబు సీమాంధ్రలో నాయకత్వం వహిస్తూ, తెలంగాణలో నారా లోకేశ్ నాయకత్వం వహిస్తే బాగుంటుందని నేతలు కొందరు ప్రచారం మొదలెట్టారు. లోకేశ్ తెలంగాణ నుంచే పోటీ చేయాలని ఆదివారం పార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు.

తాను పుట్టింది తెలంగాణలో, తమ కుటుంబానిది రాయలసీమ, తాను ఆంధ్రా అల్లుడిని అంటూ లోకేష్ యువత సమావేశంలో మూడు ప్రాంతాలనూ ప్రస్తావించారు. గతంలో ఎప్పుడూ లోకేష్ తెలంగాణలో పుట్టినట్టు చెప్పుకోలేదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె సాగుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలను తెలంగాణవాదులు అడ్డుకుంటామని ప్రకటించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తాను హైదరాబాద్‌లో పుట్టానని చెప్పుకున్నారు. కానీ తెలంగాణ అని చెప్పుకోలేదు. కానీ లోకేష్ తాను తెలంగాణలో జన్మించానని చెప్పుకోవడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తొలిసారిగా లోకేష్ శనివారం పార్టీ నేతల సమావేశాల్లో పాల్గొన్నారు. యువత, విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీమాంధ్ర యువత, విద్యార్థి నేతలు పార్టీ సమైక్యాంధ్ర నినాదం ఇవ్వాలని సూచించగా, లోకేశ్ నిరాకరించారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, వైయస్సార్ కాంగ్రెసు తరహాలో తెలంగాణ ప్రజలను మోసం చేయలేమని చెప్పుకొచ్చారు.

లోకేశ్ రాష్టవ్య్రాప్తంగా పర్యటించనున్నట్టు ప్రకటించారు. తండ్రి కొడుకులు దాదాపు ఒకే సమయంలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. మరోవంద రోజుల్లో ఎన్నికలు జరుగనున్నందున రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా వంద రోజులపాటు పర్యటిస్తానని లోకేష్ యువత, విద్యార్థి నేతలతో జరిగిన సమావేశంలో తెలిపారు. బాబు సీమాంధ్రలో పర్యటించే సమయంలోనే లోకేష్ తెలంగాణలో పర్యిటించే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+