వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైలిన్: సూపర్ సైక్లోన్‌గా మారుతుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ సూపర్ సైక్లోన్ (భీకర తుఫాను)గా మారుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. 1999లో సంభవించిన సూపర్ సైక్లోన్ అంత తీవ్రతతో ప్రళయం సృష్టిస్తుందా అని ప్రశ్నిస్తూ శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీరానికి దగ్గరగా వస్తే తప్ప కచ్చితంగా అంచనా వేయలేమని చెప్పినట్లు ఓ పత్రిక రాసింది.

ఫైలిన్ తీరం దాటే సమయంలో 210 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తాజాగా అంచనావేసింది. దీంతో ఇది సూపర్ సైక్లోన్‌గా మారుతుందేమోనని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఒడిసా రాష్ట్ర ప్రభుత్వం కూడా 1999 నాటి సూపర్ సైక్లోన్ తీవ్రత ఫైలిన్‌కు వుందని ప్రకటించింది.

Cyclone Phailin

1999 నవంబర్‌లో వచ్చిన సూపర్ సైక్లోన్ తీరం దాటే సమయంలో 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచిన విషయాన్ని ఆ రాష్ట్ర అధికారి ద్రువీకరించారు. అయితే భారత వాతావరణ శాఖ మాత్రం ఇంకా దీనిని నిర్ధారించలేదు. ఇదే విషయాన్ని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం అధికారి ఒకరు స్పష్టంచేశారు. ఫైలిన్ ఇంకా తీరానికి దగ్గరగా వస్తే తప్ప అంత తీవ్రత ఉందా లేదా అన్నది అంచనా వేయలేమని అంటున్నారు.

కాగా సూపర్ సైక్లోన్‌గా ప్రకటించాలంటే అందుకు కొన్ని ప్రామాణికాలు పరిగణనలోకి తీసుకుంటారని వాతావరణ నిపణుడు ఆర్.మురళీకృష్ణ చెప్పినట్లు ఓ దినపత్రి రాసింది. ప్రచండగాలుల తీవ్రత ఒక్కటే కాకుండా దాని పయనం, వేగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు. 1999లో సూపర్ సైక్లోన్ అండమాన్ సముద్రంలో తయారై అతి వేగంగా క్రికెట్ బాల్ మాదిరిగా దక్షిణ ఒడిసా వద్ద తీరం దాటిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వున్న తీవ్ర పెనుతుఫాను మాత్రం నెమ్మదిగా కదులుతోందన్నారు.

ఫైలిన్ సూపర్ సైక్లోన్ కాదని ఆంధ్ర విశ్వవిద్యాలయ వాతావరణ శాఖాధిపతి ఆచార్య ఎస్ఎస్‌వీఎస్ రామకృష్ణ స్పష్టం చేసినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. ఫైలిన్ తుఫాను ఏర్పడిన తరువాత రెండు రోజుల నుంచి కొన్ని అధ్యయనాలు నిర్వహించామన్నారు. దీని ప్రకారం తుఫాను తీరందాటే సమయంలో 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. రెండు రోజులుగా తమ విభాగంలో జరిపిన అధ్యయనం మేరకు ఈ విశ్లేషణ చేశామన్నారు.

తుఫాన్లను ఐదు కేటగిరీలుగా విభజిస్తారని, ఫైలిన్ మూడవ కేటగిరీ (గంటకు 160 నుంచి 180 కిలోమీటర్లు వేగంతో గాలులు) అని పేర్కొన్నారు. సూపర్ సైక్లోన్ ఐదవ కేటగిరీ కిందకు వస్తుందన్నారు. అంటే తుఫాను తీరం దాటే సమయంలో గాలుల వేగం 220 కిలోమీటర్లుగా ఉంటుందన్నారు. ఆ లెక్కన చూస్తే ఫైలిన్ సూపర్ సైక్లోన్ కాద ని ఆయన స్పష్టం చేసినట్లు ఆ పత్రిక రాసింది.

English summary
According to media reports - Cyclone Phailin may turn into Super cyclone. It may cause vast damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X