వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు నో: కెసిఆర్ హ్యాపీ, కిషన్ విత్ డ్రా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)కు ఆమోదం తెలపడంతో తెలంగాణవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసంలో నేతలు పండుగ చేసుకున్నారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఈ రోజు మరువలేనిదన్నారు. ఈ తెలంగాణ బిల్లుకు సహకరించిన అన్నీ జాతీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం తెలంగాణ ప్రజలకు అంకితమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రక్రియలో సోనియా గాంధీ గారి పాత్ర మరువలేనిదని, ఆమె కఠిన నిర్ణయాల వల్లే ఈ రోజు తెలంగాణ సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.

అలాగే భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా మరవలేనిదని, తెలంగాణ ప్రజలందరి తరపున వారికి కృత జ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా మందుండి నాతో సహకరించిన టీఆర్ఎస్ సభ్యలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు విలీనంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి కెసిఆర్ హామీ ఇవ్వనట్లుగా తెలుస్తోంది.

కిషన్ 1

కిషన్ 1

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన అనంతరం దీక్ష విరమిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి.

కిషన్ 2

కిషన్ 2

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన అనంతరం దీక్ష విరమించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి జై తెలంగాణ నినాదాలు చేస్తూ...

కిషన్ 3

కిషన్ 3

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన అనంతరం దీక్ష విరమించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి మొక్కుతూ...

కిషన్ 4

కిషన్ 4

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన అనంతరం దీక్ష విరమించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో కోదండరామ్.

కెసిఆర్ 1

కెసిఆర్ 1

రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)కు ఆమోదం తెలపడంతో తెలంగాణవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసంలో నేతలు పండుగ చేసుకున్నారు.

కెసిఆర్ 2

కెసిఆర్ 2

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఈ రోజు మరువలేనిదన్నారు. ఈ తెలంగాణ బిల్లుకు సహకరించిన అన్నీ జాతీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.

కెసిఆర్ 3

కెసిఆర్ 3

ఈ విజయం తెలంగాణ ప్రజలకు అంకితమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రక్రియలో సోనియా గాంధీ గారి పాత్ర మరువలేనిదని, ఆమె కఠిన నిర్ణయాల వల్లే ఈ రోజు తెలంగాణ సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.

కెసిఆర్ 4

కెసిఆర్ 4

అలాగే భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా మరవలేనిదని, తెలంగాణ ప్రజలందరి తరపున వారికి కృత జ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.

కెసిఆర్ 5

కెసిఆర్ 5

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా మందుండి నాతో సహకరించిన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యలందరికీ కెసిఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కెసిఆర్ 6

కెసిఆర్ 6

ఇది ఎవరి విజయం.. అలాగే ఎవరి ఓటమి కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర సోదరులు ఆందోళన చెందాల్సినవసరం లేదని, వారందరూ మా సోదరులేనని ఆయన వ్యాఖ్యానించారు.

కెసిఆర్ 7

కెసిఆర్ 7

హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజలకి ఎటువంటి అపోహలు వద్దని , వారందరూ ఇక్కడ సంతోషంగా జీవించవచ్చని అందులో ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబద్‌ను ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.

కెసిఆర్ 8

కెసిఆర్ 8

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న వాళ్లంతా తమ వాళ్లేనని, కలిసి మెలిసి సంతోషంగా ఉందామని కె చంద్రశేఖర రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కెసిఆర్ 9

కెసిఆర్ 9

ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నందున, రాష్ట్రాలుగా విడిపోయి అందరం సహకరించుకుందామని గులాబీ దళపతి సూచించారు.

కెసిఆర్ 10

కెసిఆర్ 10

భాగ్యనగరాన్ని ప్రపంచ ప్రసిద్ధి నగరంగా రూపాందరం చెందేలా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేలా చేద్దామని కెసిఆర్ ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

కెసిఆర్ 11

కెసిఆర్ 11

రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)కు ఆమోదం తెలపడంతో తెలంగాణవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసంలో నేతలు పండుగ చేసుకున్నారు.

కెసిఆర్ 12

కెసిఆర్ 12

తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసంలో నేతలు పండుగ చేసుకున్నారు.

కెసిఆర్ 13

కెసిఆర్ 13

తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేయగానే తెలంగాణ భవన్‌లోను సంబురాలు అంబరాన్ని అంటాయి. కార్యకర్తలు గులాబీ రంగు చల్లుకుంటూ 'కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

విహెచ్

విహెచ్

రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మిఠాయిలు పంచుతూ...

English summary
Telangana Rashtra Samithi (TRS) president K. Chandrasekhar Rao wasted no time in trying to instil confidence in people of Seemandhra living in Hyderabad and elsewhere in Telangana region and said that they were “our own”, immediately after the Upper House cleared the A.P. Reorganisation Bill on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X