హనీప్రీత్‌పై రేప్, వారసుడి డిమాండ్‌కు లొంగిన డేరాబాబా! రహస్య సంతానానికి యత్నం?

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛ సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్(డేరా బాబా) గురించిన మరో సంచలన విషయం వెలుగుచూసింది.

సిర్సా: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛ సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్(డేరా బాబా) గురించిన మరో సంచలన విషయం వెలుగుచూసింది. తన దత్తపుత్రికగా చెప్పుకుంటూనే హనీప్రీత్ ఇన్సాన్‌తో శారీక సంబంధాన్ని కొనసాగించాడని తాజాగా ఓ భక్తుడు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాడు.

హనీప్రీత్‌పై అత్యాచారం

హనీప్రీత్‌పై అత్యాచారం

భక్తురాలిగా డేరాలో అడుగుపెట్టిన హనీప్రీత్‌పై డేరా బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె బెదిరింపులకు గురిచేయడంతో ఆమెను తనవద్దే ఉంచుకున్నాడు. అయితే, హనీప్రీత్ కూడా డేరాబాబాతో ఓ కుమారుడ్ని కని.. అతడ్నే ఈ డేరాకు అధిపతిని చేయాలని తలచినట్లు ఈ భక్తులు వెల్లడించాడు.

బాబాను బెదిరించిన హనీప్రీత్

బాబాను బెదిరించిన హనీప్రీత్

చాలా సంవల్సరాల క్రితం హనీప్రీత్.. డేరాబాబాకు పరిచయమైందని తెలిపాడు. భక్తురాలిగా వచ్చిన ఆమెపై గుఫా(ప్రత్యేక ప్రదేశం)లో డేరా బాబా అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పాడు. అప్పటికే ఇద్దరు సాధ్వీలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తాను కూడా కోర్టుకెక్కుతానని హనీప్రీత్ బాబాను బెదిరించింది. దీంతో బాబా ఆమె చెప్పినట్లు చేసేందుకు అంగీకరించాడు.

నిలదీసిన హనీప్రీత్ తాత.. కానీ,

నిలదీసిన హనీప్రీత్ తాత.. కానీ,

డేరాబాబా వద్దకు వెళ్లిన హనీప్రీత్ కొద్ది సేపటి తర్వాత ఏడ్చుకుంటూ బయటికి వచ్చిందని ఆ సమయంలో ఆ స్థలంలో కాపలాగా ఉన్న డేరాబాబా డ్రైవర్ ఖట్టా సింగ్, అతని కుమారుడు గుర్దాస్ సింగ్ తెలిపారు. ఆ తర్వాత డేరాలో క్యాషియర్‌గా పని చేస్తున్న తన తాత వద్దకు హనీప్రీత్ వెల్లిందని చెప్పారు. దీంతో డేరా అధినేతను ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారని చెప్పారు. ఆ తర్వాత డేరా బాబా అనుచరులు బెదిరింపులకు గురిచేయడంతో ఆయన మిన్నకుండిపోయారని తెలిపారు.

వారసుడి కోసం..

వారసుడి కోసం..

డేరా సచ్ఛ సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీత్, హనీప్రీత్‌లు ఈ సౌధానికి తమ వారసుడ్ని అందించాలని అనుకున్నారు. ఇదంతా రహస్యంగా ఉంచాలని భావించారు.

అయితే, పరిస్థితులు వేగంగా మారిపోవడంతో అది సాధ్యం కాలేదని సమాచారం. 2002లో నమోదైన రేప్ కేసులో డేరా బాబాకు 20ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. కాగా, గుర్మీత్, హనీప్రీత్‌లు ఓ బిడ్డకు జన్మనివ్వాలని యత్నించారని సీబీఐకి గుర్దాస్ సింగ్ తోర్ అనే అనుచరుడు ఒకరు తెలిపాడు. అంతేగాక, ఆ బిడ్డకు హనీప్రీత్ మాజీ భర్తనే తండ్రిగా బయటికి చూపాలని అనుకున్నారని చెప్పాడు.

డేరాలో దంపతులే..

డేరాలో దంపతులే..

బయటి సమాచానికి తండ్రి కూతుళ్లలా నటిస్తూ డేరాలో మాత్రం భార్యాభర్తల్లా ఉండేవారని గుర్దాస్ చెప్పారు. ఇదే విషయాన్ని హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా కూడా వెల్లడించడం గమనార్హం. అంతేగాక, డేరాలోని ప్రత్యేక ప్రదేశంలో తన భార్యతో శృంగార కార్యకలాపాలు సాగిస్తున్నాడని డేరాబాబాపై ఆరోపణలు చేశారు. హనీప్రీత్ ను దత్తత తీసుకోలేదని చెప్పారు.

బాబా మనసు మార్చిన హనీప్రీత్

బాబా మనసు మార్చిన హనీప్రీత్

కాగా, అప్పటికే గుర్మీత్ రామ్ రహీమ్‌కు జస్మీత్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. అతడ్నే డేరాకు అధినేతను చేయాలని 2007లోనే భావించాడు డేరా బాబా. అయితే, హనీప్రీత్ వచ్చిన తర్వాత డేరాబాబా తన ఆలోచనను మార్చుకున్నాడు. తన ద్వారా పుట్టిన బిడ్డనే డేరాకు అధినేతను చేయాలని హనీప్రీత్ పట్టుబట్టడంతో అందుకు డేరా బాబా అంగీకరించకతప్పలేదని గుర్దాస్ తెలిపాడు. కానీ, పరిస్థితులు వారికి అనుకూలించలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+