Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వంటిల్లే ఆయుర్వేద ఆసుపత్రి: చింతగింజల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే..ఆ పని చేయరు

సరిగ్గా వినియోగించుకోగలిగితే.. మన వంటిల్లే ఓ ఆయుర్వేదిక్ ఆసుపత్రిగా చెప్పుకోవచ్చు. మనం రోజు వినియోగించే పదార్థాలు, ఆహార వస్తువులు మనకు తెలియకుండానే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటాయి. పసుపు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, పప్పులు..ఇలా చాలా రకాల దినుసులను ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే.. అనారోగ్యం అనేది దరికి చేరదంటూ పెద్దలు ఎపుడూ చెబుతుంటారు. తాజాగా- చింతపండులో కనిపించే గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని శాస్త్రీయబద్ధంగా తేలింది.

ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్లు ఏం చెబుతున్నారు?

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- రూర్కీ బయోటెక్నాలజీ ప్రొఫెసర్లు రూపొందించిన ఓ నివేదిక ప్రకారం.. చింతపండు గింజలు మన ఆరోగ్యానికి చాలారకాలుగా మేలు చేస్తాయని తేలింది. చింతపండును దాదాపు అన్ని దేశాలు కూడా వంటకాల్లో విస్తృతంగా వినియోగిస్తుంటాయి. ఇందులో కనిపించే చింత గింజలను మనం తీసి పక్కన పడేస్తుంటాం. వాటివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఆ పని చేయబోరని ఐఐటీ-రూర్కీ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్లు స్పష్టం చేశారు.

Tamarind Seeds: IIT Roorkee Professors have shown that a protein found and antiviral properties

మోకాలి నొప్పులున్న వారికి..

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఐఐటీ ప్రొఫెసర్లు తెలిపారు. ముందుగా కొన్ని చింత గింజ‌ల‌ను తీసుకుని వాటిని బాగా వేయించాలి. వాటిని రెండు రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి. గట్టిగా ఉండటం వల్ల కనీసం రెండు రోజుల పాటు నీళ్లల్లా నానబెట్టాల్సి ఉంటుంది. బాగా నానిన తరువాత చింత గింజ‌ల‌ను తీసి వాటిపై ముదురు గోధుమరంగులో కనిపించే పొట్టును తొలగించాలి. అనంత‌రం వ‌చ్చే విత్త‌నాల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి ఎండ‌బెట్టాలి. నేరుగా సూర్యరశ్మి సోకేలా ఎండబెట్టకూడదు.

Tamarind Seeds: IIT Roorkee Professors have shown that a protein found and antiviral properties

పొడి వల్ల కలిగే లాభాలెన్నో..

అలా ఎండిన ముక్క‌ల‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. ఆ పొడిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ ఓ అర టీస్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటితో క‌లిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా దీని కోసం వినియోగించుకోవచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు దూరమౌతాయని ఐఐటీ-రూర్కీ ప్రొఫెసర్లు తెలిపారు. నాలుగు వారాల్లో మోకాళ్ల నొప్పులు పూర్తిగా నయం కావడానికి అవకాశం ఉందని స్పష్టం చేశారు. మోకాలి నొప్పులతో బాధపడే వారు ఈ పొడిని క్రమం తప్పకుండా వాడితే ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

డయేరియాను సైతం దూరం పెట్టొచ్చు..

చింత గింజ‌ల్లో ఉండే ఔష‌ధ పదార్థాలు ఎముక‌ల‌కు బ‌లాన్ని ఇస్తాయని, ఫలితంగా నొప్పులు తగ్గుతాయని పేర్కొన్నారు. చికున్ గున్యా వంటి ఎముకల సంబంధ సమస్యలను నివారించడానికి చింతగింజలు ఎంతో బాగా పని చేస్తాయి. కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి చేస్తాయని అంచనా వేశారు. ఈ చింతగింజల పొడికి డ‌యేరియాను నయం చేసే శక్తి కూడా ఉన్నట్లు తెలిపారు. అజీర్ణంతో బాధపడే వారు చింతగింజల పొడిని రోజూ తీసుకోవడం వల్ల వేగంగా ఉపశమనం పొందుతారని తమ నివేదికలో స్పష్టం చేశారు. దంత సంబంధ స‌మ‌స్య‌లు సైతం దూరమౌతాయట.

Tamarind Seeds: IIT Roorkee Professors have shown that a protein found and antiviral properties

చర్మ సంబంధ ఇన్‌ఫెక్షన్స్ కూడా..

చింత గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్.. చర్మ సంబంధ ఇన్‌ఫెక్షన్స్‌ను కూడా దూరం చేస్తాయని, ఇంటెస్టైనల్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందని పేర్కొన్నారు. చింత గింజలు పాంక్రియాస్‌ను ప్రొటెక్ట్ చేస్తాయని, వీటిని నాన బెట్టిన నీటిని తాగడం వల్ల బ్లడ్, షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని చెప్పారు. అధిక రక్తపోటు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి చింత గింజల్లో ఉండే పొటాషియం ఎంతో మేలు చేస్తుందని ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్లు తమ నివేదికలో పొందుపరిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+