వాట్సాప్ ఛానెల్‌కి, గ్రూప్‌కి మ‌ధ్య తేడా ఏంటో తెలుసా..?

ప్ర‌స్తుత స‌మాజంలో స్మార్ట్‌ఫోన్ లేని వారంటూ ఎవ‌రూ ఉండ‌రు. ఏ స్మార్ట్‌ఫోన్ అయినా అన్నీ ఫీచ‌ర్స్ అందులో ఉంటున్నాయి. ఫీచ‌ర్స్ లేని స్మార్ట్‌ఫోనే ఉండ‌డం లేదు. ప్ర‌తిది అందులో ఉంటుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూటూబ్‌, టెలిగ్రామ్‌, ట్విట్ట‌ర్‌, ఇలా ప్ర‌తి ఒక్క‌టి ఉంటాయి. ప్ర‌స్తుతం మ‌నం వాడే వాట్సాప్ చానెల్‌లో కొత్త కొత్త ర‌కాల ఫీచర్స్ అందుబాటులోకి వ‌స్తున్నాయి. తాజాగా భారతదేశంలో వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ను ప్రారంభించారు. వెంటనే చాలా మంది భారతీయ ప్రముఖులు, కంపెనీలు వాట్సాప్ ఛానెల్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఇండియాలో వాట్సాప్ యాప్‌లోని ఛానెల్స్ ఫీచర్‌ను మెటా కంపెనీ అధికారికంగా ప్రారంభించింది.

ఈ కొత్త ఫీచ‌ర్ ప్ర‌త్యేక‌త‌..
ఈ కొత్త ఫీచర్ ప్ర‌త్యేక‌త ఏంట‌టే.. ముఖ్యమైన మెసేజెస్‌ను ప్ర‌యివేట్‌గా పొందే అంటే భ‌ద్ర‌ప‌రుకునే సౌక‌ర్యాన్నిఅందిస్తుంద‌న్న‌మాట‌. ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా సంస్థలు సమాచారాన్ని షేర్ చేసేందుకు WhatsApp ఛానెల్స్ ఒక మార్గాన్ని అందిస్తాయి. ఈ ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్ర‌క‌టించిన వెంట‌నే చాలా మంది ప్రముఖులు, రాజ‌కీయనాయ‌కులు, సెల‌బ్రీటీలు సైతం ఈ వాట్సాప్ ఛానెల్‌లో చేరారు. భారత క్రికెట్ టీం, ప్రధాని మోదీతో పాటు పలువురు వాట్సాప్ చానెళ్లను ప్రారంభించారు.

WhatsApp

వాట్సాప్ ఛానెల్‌లో మొద‌టి పోస్ట్ పెట్టిన ప్ర‌ధాని..
మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కూడా ఈ వాట్సాప్ ఛానెల్‌ను ప్రారంభించారు. అందులో ముందుగా "వాట్సాప్ కమ్యూనిటీలో చేరడం నాకు ఎంతో సంతోష‌క‌రంగా ఉంది.! నిరంతర కమ్యూనికేషన్ ప్రయాణంలో మీతో మరింత దగ్గరయ్యేందుకు ఈ ఫీచర్ ఒక ముందడుగు వంటిది. లెట్స్ స్టే కనెక్టెడ్ ! అంటూ కొత్త పార్లమెంట్ భవనం నుండి ఒక ఫోటో ఇక్కడ ఉంది..." అంటూ వాట్సాప్ ఛానెల్‌ మొదటి పోస్ట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాట్సాప్‌ను ఉప‌యోగించే వారు వారికీ ఇష్ట‌మైన ఛానెల్‌ను సెల‌క్ట్‌ చేసుకోని ఫాలో కావొచ్చు. ఛానెల్‌లో పబ్లిష్ చేసిన పోస్ట్‌లు WhatsApp అప్ డేట్స్ సెక్షన్‌లో ఉంటాయి.

మ‌రో విశిష్ట‌త‌..
దీనికి ఉన్న మ‌రో ప్ర‌త్యేక‌త ఏంట‌టే, ఛానెల్‌లో కొత్త పోస్ట్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ కూడా వస్తుంది. వాట్సాప్ ఛానెల్ అండ్ వాట్సాప్ గ్రూప్ మధ్య ముఖ్యమైన తేడా కూడా ఉంది. ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా అందులో మీకంటే ముందే ఉన్న ఇతర గ్రూప్ మెంబర్స్ తో చాట్ చేసే అవకాశం మ‌న‌కు ఉంటుంది. అయితే, ఇందులో మాత్రం కేవ‌లం ఛానెల్ ప్రారంభించిన వ్యక్తి మాత్రమే ఛానెల్‌లో పోస్ట్ చేస్తాడు. ఛానెల్‌ని ఫాలో చేసే ఎవరైనా ఫ్రీ టైంలో ఆ పోస్ట్‌లను చూడొచ్చు ఇంకా చదవవచ్చు. ఇదే దీనికున్న మ‌రో విశిష్ట‌త‌.

WhatsApp ఛానెల్‌లో ఎలా చేరాలి?
ముందుగా వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి చాట్స్ సెక్షన్ పక్కన ఉన్న అప్‌డేట్స్ సెక్షన్ లోకి వెళ్లండి. ఇక్కడ కింద మీకు నచ్చిన ఛానెల్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ ఛానెల్‌ ఫాలో బటన్‌ను క్లిక్ చేయండి. అంతే, మీరిక వాట్సాఫ్ ఛానెల్‌ను క్రియేట్ చేసుకున్న‌ట్లే..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+