Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

iPhone 14: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డే సేల్‍లో ఐ ఫోన్ 14పై భారీ తగ్గింపు..!

మీరు Apple iPhone 14 ధరపై మంచి డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్త. ఐఫోన్ 14 రూ.. 50,000 లభించే అవకాశం ఉంది. అక్టోబర్ 8న ప్రారంభమయ్యే బిగ్ బిలియన్ డే సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ పై భారీ తగ్గింపు ఇస్తున్నారు. గత సంవత్సరం ప్రకటించిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రూ. రూ. 50,000 ధరను ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ తన వెబ్‌సైట్‌లో టీజర్ ద్వారా ధృవీకరించింది.

విక్రయ సమయంలో ధరను అంచనా వేయమని వినియోగదారులను కోరుతోంది. అసలు ధర ట్యాగ్ ఉన్న ఫోన్ ధర రూ. 69,990 ఉంది. బిగ్ బిలియన్ డే సేల్ ఇది రూ.50,000 వరకు తగ్గొచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 12 ధరలు కూడా విక్రయ సమయంలో తగ్గే అవకాశం ఉంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ సమయంగా భావిస్తున్నారు. ఇతర ఆఫర్లలో Google Pixel 7 ధర ట్యాగ్ అసలు ధర రూ. 59,999 కాగా.. రూ. 36,499 ఈ సేల్ లో రూ. 36,499 లభించే అవకాశం ఉంది.

Flipkarts Big Billion Day sale is likely to offer huge discounts on the iPhone 14

నథింగ్ ఫోన్ (1) 5G అసలు ధర రూ. 37,999 కాగా సేల్ రూ. 23,999 లభించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8న ప్రారంభం కానుంది. ఐఫోన్ 14లో మెరుగైన కెమెరాలు, వేగవంతమైన A15 బయోనిక్ చిప్, వీడియో క్యాప్చర్ కోసం ఫన్ యాక్షన్ మోడ్‌ ఆప్షన్ కూడా ఉంది. కొత్త iPhone 15 అందుబాటులోకి వచ్చినప్పటికీ, మీరు బలమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే iPhone 14 బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మెరుగైన తక్కువ-కాంతి పనితీరును అందించే మెరుగైన కెమెరా సిస్టమ్, సూపర్ స్టెడీ వీడియో కోసం యాక్షన్ మోడ్, ఉపగ్రహం ద్వారా క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS వంటి సులభ భద్రతా ఫీచర్‌లను ఐ ఫోన్ 14లో ఉన్నాయి.

మీకు పెద్ద స్క్రీన్. ఎక్కువ బ్యాటరీ బ్యాకాప్ కావాలంటే iPhone 14 Plusని ఎంచుకోవచ్చు. ఐఫోన్ 14 ఖచ్చితంగా అత్యుత్తమ ఐఫోన్‌లలో ఒకటిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఐఫోన్ 14 మిడ్‌నైట్, స్టార్‌లైట్, బ్లూ, పర్పుల్, రెడ్, ఎల్లో రంగుల్లో లభించనున్నాయి. మీరు తక్కువ ధరలో ఐ ఫోన్ కావాలనుకుంటే ఐ ఫోన్ 14 మంచి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+