Google Maps: గూగుల్ మ్యాప్స్ తో ఇంధనం కూడా ఆదా చేసుకోవచ్చటా..!
గూగల్ మ్యాప్స్ (Google Maps) కొత్త పర్యావరణ అనుకూల రూటింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని వల్ల మరింత ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం కొన్ని దేశాలలోనే అందుబాటులో ఉంది. త్వరలో భారతదేశంలో ఈ ఫీచర్ ను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఫీచర్ వినియోగదారులకు ప్రత్యామ్నాయ పర్యావరణ అనుకూల మార్గాన్ని ఉపయోగించడానికి సహాయం చేస్తుంది, CO2 ఉద్గారాలతో పాటు వారి ఇంధనం/శక్తి వినియోగాన్ని తగ్గించడంలో వారికి సహాయపడుతుందని వివరించింది.
అలాగే ఇది పర్యావరణ సంక్షేమానికి కూడా తోడ్పడుతుందని పేర్కొంది. ఈ ఫీచర్ వాహనం ఇంజిన్ రకం ఆధారంగా కొన్ని మార్గాల్లో ఇంధనం సామర్థ్య అంచనాలను చూపిస్తుంది. మీరు ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్ అత్యంత శక్తి-సమర్థవంతమైన మార్గంతో పాటు గమ్యస్థానానికి వేగవంతమైన మార్గాన్ని చూపుతుందని కంపెనీ పేర్కొంది. తక్కువ అడ్డంకులు ఉన్న మార్గాలను సూచించడానికి ఇంధన-సమర్థవంతమైన రూటింగ్ కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగిస్తుందని గూగుల్ వివరించింది.

ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి :
తాజా ఫీచర్‌ని యాక్టివేట్ చేయడం సులభం. మీరు కొత్త ఫీచర్‌కి యాక్సెస్ పొందినట్లయితే, వినియోగదారు ఉన్న ప్రదేశంలో మీరు ఈ దశలను అనుసరించాలి. మొదటగా గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ప్రొఫైల్ చిత్రం లేదా మొదటి అక్షరాలపై క్లిక్ చేయాలి. సెట్టింగ్‌లకు వెళ్లాలి. అక్కడ నావిగేషన్ సెట్టింగ్‌లపై క్లిక్ చేయాలి. ఇప్పుడు 'రూట్ ఎంపికలు'కి స్క్రోల్ చేయాలి. "ఇంధన-సమర్థవంతమైన మార్గాలను ఇష్టపడండి"పై క్లిక్ చేయాలి.
అక్కడ, మీ ఇంజిన్ రకాన్ని ఎంచుకోండి. ఆపై 'ఇంజిన్ టైప్'పై క్లిక్ చేసి అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. మీరు అంతర్గత దహన యంత్రంతో కూడిన వాహనంలో డ్రైవింగ్ చేస్తున్నట్లయితే అక్కడ, మీరు గ్యాస్ (పెట్రోల్) లేదా డీజిల్ మధ్య ఎంచుకోవచ్చు.మీరు హైబ్రిడ్ కారుని కలిగి ఉంటే, మీరు హైబ్రిడ్‌ని ఎంచుకోవచ్చు లేదా మీకు ఎలక్ట్రిక్ వాహనం ఉంటే ఎలక్ట్రిక్‌ను ఎంచుకోవాలి.












Click it and Unblock the Notifications