iPhone 15: ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్.. 15 నుంచి బుకింగ్ ప్రారంభం..
ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు ప్రపంచ మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. కొత్త Apple పరికరాలు సెప్టెంబర్ 15 నుంచి ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 22 నుంచి విక్రయం ప్రారంభమవుతుంది. Apple ఢిల్లీ, ముంబైలలో తన అధికారిక స్టోర్లను ప్రారంభించిన తర్వాత ఇది మొదటి ఐఫోన్ లాంచ్. Apple iPhone 15 గత సంవత్సరంతో పోలిస్తే కొన్ని ప్రధాన మార్పులు చేసింది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫేస్ ID కోసం కొత్త డైనమిక్ ఐలాండ్ కటౌట్‌ని చేర్చడం వంటివి చేసింది.
అమెరికా కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా వండర్ లస్ట్ పేరుతో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. కొత్త ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్‌లలో A16 బయోనిక్ చిప్‌ను ప్రవేశపెట్టారు. కెమెరా పరంగా కొత్త 48 MP లెన్స్ రూపంలో గణనీయమైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్ చేశారు. ఇది iPhone 14, iPhone 14 Plus కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లు 48 మెగాపిక్సల్ కెమెరా ఇచ్చారు. 24 ఎంఎం, 28 ఎంఎం, 38 ఎంఎం లెన్స్‌ను ఇచ్చారు. దీంతో హైరెజల్యూషన్ ఫొటోస్, వీడియోలను తీసుకోవచ్చట.

భారతదేశంలో iPhone 15, iPhone 15 Plus ధర ఎలా ఉన్నాయంటే..
Apple iPhone 15 128GB మోడల్‌కు రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. అయితే iPhone 15 Plus మోడల్ 128 GB మోడల్‌కు రూ 89,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్లు బ్లూ, పింక్, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో ఉన్నాయి.ఐ ఫోన్ 15 (128 GB)కి రూ. 79,900, ఐ ఫోన్ 15 (256 GB)కి రూ. 89,900, ఐ ఫోన్ 15 (512GB)కి రూ. 1,09,900, ఐ ఫోన్ 15 Plus (128 GB)కి రూ. 89,900, ఐ ఫోన్ 15 Plus (256 GB)కి రూ. 99,900, ఐ ఫోన్ 15 Plus (512 GB)కి రూ. 1,19,900 గా ఉంది.
ఐ ఫోన్ 15లో 6.1 ఇంచెస్ డిస్ప్లే , ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 డిస్ ప్లే ఉంది. ఓఎల్‌ఈడీ సూపర్ రెటీనా డిస్‌ప్లే తో ఫోన్లు ఉన్నాయి. Apple iPhone 15, iPhone 15 Plusలలో ఉపయోగించిన దాని కంటే సెన్సార్ పెద్దదని Apple పేర్కొంది. తక్కువ కాంతిలో కూడా ఫొటోలు తీయ్యొచ్చు. అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఇప్పుడు మాక్రో-ఫోటోగ్రఫీకి కూడా ఉపయోగించవచ్చు. ఆపిల్ ప్రో మాక్స్ మోడల్‌లకు కెమెరా విభాగంలో అదనపు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లలో 2xతో పోలిస్తే ఇది 5x ఆప్టికల్ జూమ్‌ని అనుమతించే పెరిస్కోప్ లెన్స్‌ను ఇచ్చారు.
-
రెడ్మీ 15A 5G రూ. 12,999 మాత్రమే.. -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications