జియో సిమ్ కార్డు వాడేవారికి బంపర్ ఆఫర్
ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) స్మార్ట్‌ఫోన్లు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ ఫోన్ కొనేవారికి రిలయన్స్ జియో (Reliance Jio) బంపరాఫర్ ప్రకటించింది. రూ.2,394 విలువైన కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ ఇవ్వనుంది. అలాగే రూ.399 ప్లాన్‌ను ఆరు నెలల పాటు ఉచితంగా అందించనుంది. సెప్టెంబరు 22వ తేదీ నుంచి ఈ ప్లాన్ అమల్లోకి వచ్చింది.
రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్, రిలయన్స్ రీటైల్ స్టోర్లలో ఐఫోన్ 15 కొనేవారికి మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. అంతేకాదు.. కొత్త ప్రీపెయిడ్ యాక్టివేషన్స్‌కి మాత్రమే ఈ ఆఫర్. జియో సిమ్ వాడనివారైతే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీద్వారా ఆఫర్ పొందొచ్చు. రూ.399 ప్లాన్ రీఛార్జి చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతోపాటు రోజుకు 3 జీబీ డేటా వస్తుంది. రూ.61 విలువైన 6జీబీ డేటా కూడా అదనంగా లభిస్తుంది. మొత్తం 90 జీబీ వాడుకోవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ లాంటి యాప్స్‌కి యాక్సెస్ లభిస్తుంది. అర్హులైన సబ్‌స్క్రైబర్లకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఇస్తారు. ఐఫోన్ 15 కొనేవారు ఈ ప్లాన్‌ను ఆరు నెలల పాటు ఉచితంగా పొందొచ్చు. తద్వారా రూ.2,394 ఆదా చేసినట్లవుతుంది. యో సిమ్ ఐఫోన్ 15లో వేసిన తర్వాత 72 గంటల్లో కాంప్లిమెంటరీ ఆఫర్ ఆటో క్రెడిట్ అవుతుంది. అర్హులైన వినియోగదారులకు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఈ ఆఫర్ కేవలం ఐఫోన్ 15 డివైజ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఐఫోన్ 15 సిరీస్ లో 128 జీబీ వేరియంట్ రూ.79,900 కాగా, 256 జీబీ వేరియంట్ రూ.89,900. హై ఎండ్ వేరియంట్ 512 జీబీ మోడల్ రూ.1,09,900 గా ఉంది. నలుపు, నీలం, పసుపు, గులాబీరంగుల్లో లభిస్తోంది.












Click it and Unblock the Notifications