keyboard_backspace

మాజీ రాష్ట్రపతికి అందే సౌకర్యాలివే: సోనియాగాంధీ పొరుగింట్లోకి కోవింద్ షిఫ్ట్

Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి పేద, గిరిజన మహిళ సాధించిన విజయంగా అభివర్ణించారు. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తానని హామీ ఇచ్చారు.

టైప్- 8 బంగళా..

టైప్- 8 బంగళా..

ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. రాష్ట్రపతి భవన్‌ను వీడారు. నంబర్ 12, జన్‌పథ్ బంగళాకు షిఫ్ట్ అయ్యారు. టైప్-8 బంగళా ఇది. సాధారణంగా పదవీ కాలం ముగిసిన రాష్ట్రపతికి అలాంటి బంగళాను కేటాయిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేసే డైెరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ అధికారులు పర్యవేక్షణలో ఉంటుంది ఈ బంగళా. జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ యాక్ట్ ప్రకారం.. దీన్ని కేటాయిస్తారు.

ఇదివరకు ఈ బంగళాలో..

ఇదివరకు ఈ బంగళాలో..


మొత్తం ఏడు విశాలమైన గదులు ఇందులో ఉంటాయి. అందులో పనిచేసే సిబ్బందికి అవసరమైన క్వార్టర్లు కూడా బంగళా ఆవరణలోనే ఉంటాయి. ఇదివరకు 12, జన్‌‌పథ్ బంగళాను కేంద్ర మంత్రి, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ వినియోగించారు. సుమారు రెండు దశాబ్దాల పాటు ఆయన ఇందులోనే నివాసం ఉన్నారు. ఆయన మరణానంతరం కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఇందులో నివాసించారు. ఈ ఏడాది మార్చిలో దీన్ని ఖాళీ చేశారు.

లక్షన్నర రూపాయలు..

లక్షన్నర రూపాయలు..


ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక ఆధినేత్రి సోనియా గాంధీ జన్‌పథ్‌లోనే నివసిస్తోన్నారు. మాజీ రాష్ట్రపతికి పలు సౌకర్యాలను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. పదవిలో ఉన్న సమయంలో రాష్ట్రపతికి ప్రతినెలా అయిదు లక్షల రూపాయల వేతనం అందుతుంటుంది. పదవీ కాలం ముగిసిన తరువాత లక్షన్నర రూపాయల పింఛన్ అందుతుంది. ప్రెసిడెంట్స్ ఎమోల్యుమెంట్స్ అండ్ పెన్షన్స్ (అమెండ్‌మెంట్) యాక్ట్ 2008 ప్రకారం.. ఈ వేతనాలు, పింఛన్లను కేంద్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది.

 కార్యదర్శితో పాటు..

కార్యదర్శితో పాటు..

ఈ యాక్ట్ ప్రకారం.. ఓ ప్రైవేట్ కార్యదర్శి, మరో అదనపు ప్రైవేట్ కార్యదర్శి, ఒక పర్సనల్ అసిస్టెంట్, ఇద్దరు ప్యూన్లను మాజీ రాష్ట్రపతి నియమించుకునే అవకాశం ఉంది. కార్యాలయ ఖర్చుల కోసం ప్రతినెలా 60,000 రూపాయలను వ్యయం చేసుకునే వెసలుబాటు మాజీ రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే- రెండు ల్యాండ్ లైన్ కనెక్షన్లు, ఒక మొబైల్ ఫోన్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌కు అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుంది.

 జీవితకాలం..

జీవితకాలం..

జీవితకాలం ఉచిత వైద్యాన్ని మాజీ రాష్ట్రపతి అందుకుంటారు. అలాగే- జీవితకాలం పాటు ఫస్ట్ క్లాస్ రైలు, విమాన ప్రయాణ సౌకర్యాలు అందుతాయి. ఈ ఉదయం ఆయన రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేశారు. భార్య సవిత కోవింద్‌తో కలిసి బుల్లెట్ ప్రూఫ్ కారులో 12 జన్‌పథ్ నివాసానికి చేరుకున్నారు. కోవింద్ ఇక్కడికి షిఫ్ట్ కావడానికి ముందే- ఈ బంగళాలో మార్పులు చేర్పులు చేశారు. కోవింద్ ఆదేశాల మేరకు ఆయన కుమార్తె దగ్గరుండి ఇందులో మార్పులు చేర్పులు చేయించారు.

English summary
What life awaits Ram Nath Kovind after his Presidential tenure? What benefits and perks will he continue to get after retirement?.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X