AI ఉద్యోగాలు కావాలా ? ఈ ఐదు రాచమార్గాలు మీ కోసమే..!
కృత్రిమ మేథ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోతలు పెరిగిపోతున్న వేళ నిరుద్యోగ యువత ఆలోచనల్లో కూడా మార్పు వస్తోంది. ఏఐ కారణంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఎలాగో పోయేలా ఉన్నాయి, కొత్త ఉద్యోగం కావాలన్నా కృత్రిమ మేతకు సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే. కాబట్టి నేరుగా ఏఐ ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలు, డిగ్రీల కోసం అన్వేషణ పెరుగుతోంది. ఇలాంటి వారి కోసం ఇప్పుడు ఓ ఐదు డిగ్రీలు రాచమార్గాలుగా కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఏఐ ఉద్యోగాల కోసం వివిధ కంపెనీలు అడుగుతున్న అర్హతల ఆధారంగా చూస్తే ఐదు రకాల డిగ్రీలకు మార్కెట్లో ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. ఈ ఐదు డిగ్రీల్లో ఒకటి చేసి ఉన్నా వారికి ఏఐ ఉద్యోగం ఖాయమన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఈ డిగ్రీలు పూర్తి చేసిన వారు అయితే హాయిగా ఏఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేసుకోవచ్చు. చేయకపోతే ఇప్పటికైనా ఆయా డిగ్రీలు చేసేందుకు మొగ్గు చూపాల్సి ఉంటుంది.

ఇలా ఏఐ ఉద్యోగాల కోసం కంపెనీలు ప్రముఖంగా అడుగుతున్న డిగ్రీల్లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు, ఏఐ ఆధారిత డిగ్రీలు, మెషిన్ లెర్నింగ్ డిగ్రీలు, రోబోటిక్స్ ఇంజనీరింగ్ మరియు అటానమస్ సిస్టమ్స్ డిగ్రీలు, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ అండ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డిగ్రీలు ఉన్నాయి. వీటిలో యువత తమ ఆసక్తి మేరకు సరైన డిగ్రీని ఎంచుకుంటే చాలు భవిష్యత్తులో ఏఐ ఉద్యోగాలు కచ్చితంగా లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

ప్రస్తుతం కంపెనీలు ఆఫర్ చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్, డొమైన్ ఎక్స్ పర్టైజ్ ఈ డిగ్రీల ద్వారా కచ్చితంగా లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఈ డిగ్రీలు పూర్తి చేస్తే ఏఐలో కింది స్దాయి ఉద్యోగాల నుంచి టాప్ ఉద్యోగాల వరకూ ఏదో ఒకటి కచ్చితంగా లభించే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీ డిమాండ్ కు అనుగుణంగా యూనివర్శిటీల్లోనూ వీటికి ఆదరణ లభిస్తోంది.












Click it and Unblock the Notifications