మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ధురందర్ 2' ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తోంది. ప్రేక్షకుల భావోద్వేగాలను అడ్డుగా పెట్టుకొని, నిజ జీవితంలో రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ప్రజల మంచికోసమని చెప్పే ప్రయత్నాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమా ద్వారా చేశారు. అయితే ఎవరి ఆదేశాల ప్రకారం, ఎవరి అడుగులకు మడుగులు ఒత్తడం కోసం ఈ పనిచేశారో ఆయనకే తెలియాలి. దేశవ్యాప్తంగా ప్రజల మనసుల్లో, ప్రేక్షకుల ఆలోచనా భావాల్లో విద్వేషపూరిత చీలిక తెచ్చే ప్రయత్నం మాత్రం చేశారు.
రణవీర్ ను ఎంచుకోవడం వెనక ఒక పక్కా వ్యూహం
రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. కానీ, 'ధురందర్ 2'లో ఆ నిర్ణయాల వెనుక ఉన్న 'మంచితనాన్ని' లేదా 'అవసరాన్ని' భావోద్వేగపూరితంగా చూపించే ప్రయత్నం చేశారు. ఒక నాయకుడు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా, అది ప్రజల కోసమే అనే భావనను ప్రేక్షకుల మనసులో బలంగా నాటడమే ఈ సినిమా అసలు లక్ష్యం. రణవీర్ సింగ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోను ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉంది. యువతను, సామాన్య ప్రజలను ఆకర్షించడంలో ఆయనకున్న క్రేజ్ సినిమాలోని రాజకీయ సందేశాన్ని త్వరగా జనాల్లోకి తీసుకెళ్తుంది. నాయకుడి వ్యక్తిత్వాన్ని ఒక 'ప్రజా పోరాట యోధుడు' గా చూపించి రాజకీయ మైలేజ్ పొందాలనే వ్యూహం స్పష్టంగా కనిపించింది.

లాభనష్టాలు రెండూ ఉంటాయి
ఇలాంటి సినిమాలు సాధారణంగా ఎన్నికల ముందు లేదా రాజకీయంగా కీలకమైన సమయాల్లోనే విడుదలవుతుంటాయి. 'ధురందర్ 2' కూడా సరైన సమయంలో రావడం వల్ల, ఓటర్లలో ఒక రకమైన సానుకూలతను సృష్టించేందుకు ఇది ఒక 'రాజకీయ అస్త్రం'లా పనిచేస్తుంది. సినిమాలో ప్రతి అడుగును 'మాస్టర్ స్ట్రోక్' గా చూపిస్తారు. వాస్తవానికి రాజకీయాల్లో లాభనష్టాలు రెండూ ఉంటాయి, కానీ స్క్రీన్ మీద కేవలం విజయాలను, త్యాగాలను మాత్రమే హైలైట్ చేస్తారు.
సినిమా ద్వారా రాజకీయ నిర్ణయాలను పాలిష్ చేసి, అవి సరైనవే అని ప్రజలను నమ్మించే ప్రయత్నం వంద శాతం వాస్తవం. ఏ రాజకీయ సినిమా అయినా 60% వాస్తవం, 40% నాటకీయత తో ఉంటుంది. 'ధురందర్ 2' విషయంలో కూడా ఆ ప్లాన్ పక్కాగా అమలు జరిగిందని చెప్పొచ్చు. అయితే రణవీర్ సింగ్ నటన ఆ రాజకీయ సందేశానికి మరింత బలాన్ని చేకూర్చింది.
-
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ???












Click it and Unblock the Notifications