‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’
భారీ అంచనాల మధ్య విడుదలైన 'ధురంధర్ 2' మొదటి వారం వసూళ్ల సునామీ సృష్టించినప్పటికీ, ఆ తర్వాత ఆ జోరును కొనసాగించడంలో తడబడుతోంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈ సినిమా రన్ ఎలా ఉండబోతోంది? ఎంత రాబట్టే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఆ సినిమాకు పెద్ద సవాల్ గా మారింది. 'ధురంధర్ 2' చిత్రం విడుదలై 25 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో, వసూళ్ల లెక్కలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
మొదటి భాగం సృష్టించిన అసాధారణ రికార్డులతో పోలిస్తే, రెండోభాగం ఆశించిన స్థాయిలో లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మొదటి భాగం తరహాలోనే లాంగ్ రన్ ఉండి ఉంటే, ఈ చిత్రం ఇప్పటికే రూ.2500 కోట్ల క్లబ్లో చేరి ఉండాల్సింది. ప్రస్తుతం ఈ సినిమా 1800 కోట్ల మైలురాయిని చేరుకోవడానికే తీవ్రంగా శ్రమిస్తోంది. భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచి 'బాహుబలి 2' రికార్డులను ఇది అధిగమిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

పనిదినాల్లో నెమ్మదించిన సినిమా
ప్రపంచవ్యాప్తంగా 25వ రోజున 'ధురంధర్2'కు సుమారు 21 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో భారత్ నుండి 17.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్ నుండి 3.50 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ఈ గణాంకాలను పరిశీలిస్తే, వర్కింగ్ డేస్‌లో సినిమా నెమ్మదించిందని స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొత్తం రూ.1712 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. భారతీయ మార్కెట్లో రూ.1297 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ నుండి రూ.415 కోట్ల గ్రాస్ నమోదైంది.
వివాదాలు, గణాంకాల గోల్మాల్!
మరోవైపు, ఈ సినిమా వసూళ్లపై ట్రేడ్ వర్గాల్లో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఈ చిత్రం ఇప్పటికే రూ.1758 కోట్ల మార్కును దాటేసిందని చెబుతుంటే, మరికొందరు విమర్శకులు మాత్రం ఇది రూ.1625 కోట్లకు పరిమితమైందని వాదిస్తున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం రూ.1800 కోట్ల మార్కు అనేది ఈ చిత్రానికి దగ్గరలోనే ఉంది. ప్రస్తుతం అందరి కళ్లు రాబోయే వీకెండ్ పైనే ఉన్నాయి. బాహుబలి 2 లైఫ్ టైమ్ గ్రాస్ వసూళ్లను అందుకోవాలంటే 'ధురంధర్ 2' రాబోయే శని, ఆదివారాల్లో అద్భుతమైన వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే బాహుబలి రికార్డును దాటడం ఈ చిత్రానికి కత్తిమీద సామే అనిపిస్తోంది. ఈ వీకెండ్ గడిస్తేకానీ 'ధురంధర్2' బాక్సాఫీస్ వద్ద ఏ స్థానంలో నిలుస్తుందనేది తెలుస్తుంది.
-
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే!











Click it and Unblock the Notifications