రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: పెద్ది నుంచి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జానర్లో రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమరిస్తున్నాయి. ఇందులో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ పరిస్థితుల్లో రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త అందింది. పెద్ది మూవీ టీజర్ ఈ నెల ఈ నెల 27న విడుదల కానుంది. శ్రీరామనవమి పండగ, అదే రోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్ టైటిల్, కుస్తీ సాంగ్ ను విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. పెద్ది టీజర్ టీజర్‌కు కుస్తీ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. దీని ద్వారా గ్రామీణ క్రికెట్ ప్రపంచంలో సాగే హై-ఎనర్జీ దృశ్యాలను వీక్షకులకు పరిచయం చేయనుంది యూనిట్.

ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకొంటోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా అచ్చియమ్మ అనే ఓ రూరల్ బ్యాక్ గ్రౌండ్ క్యారెక్టర్ లో కనిపించనుంది. వృద్ధి సినిమాస్, ఐవీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన రెండవ సింగిల్ "రై రై రా రా" అదరగొట్టింది. రామ్ చరణ్ హై-ఎనర్జీ కొరియోగ్రఫీ, ఏఆర్ రెహ్మాన్ గాత్రంతో తెలుగు, తమిళ భాషల్లో ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్ లో క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తోన్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఇంకో నాలుగు రోజుల్లో టాకీ మొత్తం కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ డబ్బింగ్ సైతం మొదలు పెట్టారు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఏప్రిల్l 6 నుంచి ఒక పాట, 12 నుంచి మరో పాటను షూట్ చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 30న సినిమా విడుదల కావడం ఖాయమైంది.
గతంలో రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గేమ్ ఛేంజర్' చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా అవినీతిపరులైన రాజకీయ నాయకులతో పోరాడే పాత్రను పోషించారు. ఇందులో కియారా అద్వానీ, ఎస్.జె. సూర్య, అంజలి, మేకా శ్రీకాంత్, జయరాం వంటి నటీనటులు నటించారు. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోవడంతో పెద్దిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications