Agniveer: 25 వేల పోస్టులు, ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్
దేశ సేవ చేయాలని ఆశించే యువతకు గుడ్ న్యూస్. Indian Army అగ్నివీర్ నియామకాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 25 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. సైన్యంలో చేరి నాలుగేళ్ల అగ్నివీర్ సేవా వ్యవస్థలో భాగం కావాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
నోటిఫికేషన్ ప్రకారం అగ్నివీర్ (GD), టెక్నికల్, క్లర్క్/స్టోర్‌కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. కొన్ని ట్రేడ్స్‌మన్ పోస్టులకు 8వ తరగతి ఉత్తీర్ణత సరిపోతే, GD పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి. టెక్నికల్, క్లర్క్ పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం. సోల్జర్ ఫార్మా వంటి పోస్టులకు సంబంధిత డిగ్రీ లేదా ప్రత్యేక అర్హత ఉండాలి.

వయస్సు పరిమితి కనీసం 17½ సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. వయస్సు గణన అధికారిక మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష జూన్ 1 నుంచి జూన్ 15 వరకు నిర్వహించనున్నారు.
దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో స్వీకరించబడతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Join Indian Army ద్వారా నమోదు చేసుకుని అప్లై చేయాలి. పరీక్ష, ఫిజికల్ టెస్టులు, మెడికల్ పరీక్ష తదితర దశలను పూర్తి చేసిన తర్వాత ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సైన్యాధికారులు సూచిస్తున్నారు.
Agniveer వాయు..
అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు (1/2027) బ్యాచ్ నియామకాలకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ సేవ చేయాలనే అవివాహిత పురుషులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఏఎఫ్ ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు ఫిబ్రవరి 1, 2026 తుది గడువుగా అని స్పష్టం చేసింది.
దరఖాస్తు రుసుము..
ఈ నియామకాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.550 తో పాటు జీఎస్‌టీ కలిపి దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత మాత్రమే దరఖాస్తు ప్రక్రియ పూర్తైనట్లు పరిగణిస్తారు.












Click it and Unblock the Notifications