AP Intermediate Hall Tickets: ఏపీ ఇంటర్ హాల్ టికెట్ల విడుదల-ఆన్ లైన్ లో డౌన్లోడ్ ఇలా..!
ఏపీలో ఏటా జరిగే ఇంటర్ మీడియట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 1 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలు రాసేందుకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ మోడ్ లలో హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అందుబాటులో ఉంచింది. ప్రభుత్వ కళాశాల్లో చదువుతున్న విద్యార్ధులకు నేరుగా కాలేజీల్లోనే హాల్ టికెట్లు అందిస్తుండగా.. ప్రైవేట్ కాలేజీల విద్యార్ధులకు ఆన్ లైన్ లో హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచుతున్నారు.
ఆంధప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల 2024 హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు విజయవాడలో అధికారికంగా విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వీటిని విద్యార్ధులకు అందజేశారు. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ జరగనున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు.. వారు అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ చేయడం ద్వారా వారి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, జెండర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా వీటిని పొందే అవకాశం కల్పించారు. కాలేజీల్లో హాల్ టికెట్లు లభించని వారు ఆన్ లైన్ లో వెళ్లి హాల్ టికెట్లు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఓసారి చూద్దాం..
ముందుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ bieap.apcfss.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
హోమ్‌పేజీ స్క్రీన్‌పై ఇప్పటికే బ్లింక్ అవుతున్న అడ్మిట్ కార్డ్ సెగ్మెంట్ ఉంటుంది. అడ్మిట్ కార్డ్ పై క్లిక్ చేసిన తర్వాత పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలు ఎంటర్ చేశాక సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.












Click it and Unblock the Notifications