APPSC Group1 Prelims Results: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల-లిస్ట్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఇప్పటికే అభ్యర్ధులు ప్రిలిమ్స్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన కమిషన్.. ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో ఎంపికైన అభ్యర్ధుల జాబితాలు ఉంచారు.
రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 81 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 17న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు లక్షన్నర మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లక్షకు పైగా పరీక్ష రాశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు రాసిన వారిలో 567 మంది అభ్యర్ధుల్ని తిరస్కరించారు. అలాగే 4496 మందిని మెయిన్స్ పరీక్ష కోసం ఎంపిక చేశారు. ఈ మేరకు రెండు వేర్వేరు జాబితాల్ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్ని ఏపీపీఎస్సీ నిర్వహించాల్సి ఉంది. అంటే దాదాపు ఐదు నెలల వ్యవధి లభించింది. దీంతో అభ్యర్ధులు సీరియస్ గా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇవాళ విడుదల చేసిన ఫలితాల జాబితాలను మీ సౌలభ్యం కోసం వన్ ఇండియా తెలుగు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాం. కాబట్టి అభ్యర్ధులు ఇందులో తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications