CAT result 2023: క్యాట్ పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధం-రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేనేజ్ మెంట్ కాలేజీల్లో ఎంబీఏ సీట్ల భర్తీ కోసం ఈ ఏడాది నిర్వహించిన క్యాట్ 2023 పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. క్యాట్ పరీక్ష నిర్వహణ సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) లక్నో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను ఓసారి చూసేద్దాం..

ఈ ఏడాది క్యాట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను తనిఖీ చేసి వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. CAT 2023 ఫలితాల్ని తెలుసుకోవడానికి ఐఐఎం డైరెక్ట్ లింక్ ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. iimcat.ac.in. వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ఏడాది క్యాట్ పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు. అయితే క్యాట్ పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తున్నారనేది ఐఐఎం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ రెండు రోజుల్లోనే ఫలితాలు విడుదల అవుతాయని భావిస్తున్నారు.

IIM Lucknow all set to release CAT result 2023 soon- here is how to check..

CAT (కామన్ అడ్మిషన్ టెస్ట్)ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) నాణ్యమైన మేనేజ్‌మెంట్ విద్య , పరిశోధనలను అందించేందుకు నిర్వహిస్తోంది. IIMలు ప్రధానంగా పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరియల్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లను అందిస్తాయి. ఐఐఎంల ప్రోగ్రామ్ రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఈ రెండు ప్రోగ్రామ్ లూ రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటాయి. ఐఐఎంలలో రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు ప్రవేశాలు మెరిట్ ఆధారంగా ఉంటాయి. వ్యక్తిగత ఇంటర్వ్యూ, రాత సామర్థ్య పరీక్ష / గ్రూపు డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+