Data Analytics: మూడు రోజుల్లో డేటా అనలిటిక్స్ ! ఐఐటీ ఖరగ్ పూర్ తాజా కోర్సు..!

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పెరుగుతున్న డేటా అనలిటిక్స్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని పలు విద్యాసంస్ధలు ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోర్సుల్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఐఐటీ ఖరగ్ పూర్ తాజా కోర్సును అందుబాటులోకి తెచ్చింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే లెక్చర్ సెషన్స్ ద్వారా డేటా అనలిటిక్స్ నేర్చుకునే విధంగా ఈ కోర్సును డిజైన్ చేసింది. దీని వివరాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డేటా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్ డేటా అనలిటిక్స్‌పై నిపుణులను సిద్ధం చేయడానికి స్వల్పకాలిక కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు విస్తృతమైన డేటాపై అంచనా , అనుమితిని రూపొందించడానికి గణాంక సాధనాల పరిజ్ఞానంతో నిపుణులను తయారు చేస్తుంది. కేటగిరీ డేటా అనాలిసిస్‌పై ఆన్‌లైన్ విధానంలో ఐఐటీ ఖరగ్ పూర్ మూడు రోజుల షార్ట్ టర్మ్ ఆఫర్ చేస్తోంది.

IIT Kharagpur Short Term Course In Data Analytics-here is details of registration, fee

ఈ డేటా అనలిటిక్స్ కోర్సును లెక్చర్ సెషన్‌లు, స్టాటిస్టికల్ టూల్స్ సాయంతో శిక్షణ, కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్‌ల ద్వారా అందిస్తోంది. ఆసక్తి ఉండి, అర్హత గల అభ్యర్థులు జనవరి 7, 2024లోపు దరఖాస్తు ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీన్ని ఐఐటీ ఖరగ్ పూర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి చేయవచ్చు. ఈ కోర్సులో మొత్తం సీట్లు 40 మాత్రమే. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 7, 2024. మూడు రోజుల ప్రోగ్రామ్‌కు విద్యార్థులకు 5 వేలు, ఫ్యాకల్టీకి 10 వేలు, పరిశ్రమలకు 15వేలుగా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ సమయంలో అభ్యర్థులు సంస్థ/ఇన్‌స్టిట్యూట్ ఐడీ కార్డ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఐఐటీ ఖరగ్‌పూర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం..డేటా అనలిటిక్స్ యుగంలో, సంస్థలు పెద్ద మొత్తంలో డేటాను సేకరిస్తాయి, నిల్వ చేస్తాయి. అటువంటి డేటా యొక్క గణనీయమైన భాగం వర్గీకరిస్తారు. ఈ వర్గీకరణ డేటా నుండి అర్ధవంతమైన ముగింపులకు రావడానికి ప్రత్యేక గణాంకాలు అవసరం. ఈ మూడు-రోజుల స్వల్పకాలిక కోర్సులో పాల్గొనేవారికి ఈ గణాంక నమూనాలను పరిచయం చేస్తారు. అలాగే R, SPSS, Minitab, EViews వంటి ప్రముఖ గణాంక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి నిజ జీవిత సమస్యల పరిష్కారానికి వారి అప్లికేషన్‌లపై కూడా పరిచయం చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+