Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఐటీ మద్రాస్ ఉచిత ఆన్ లైన్ కోర్సులు-అర్హత ఇంటర్- పూర్తి వివరాలివే..

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా క్లాసు రూముల్లో చదువుకున్న చదువులకూ ఉద్యోగాల్లో చేరాక చేయాల్సిన పనికీ మధ్య పొంతన ఉండటం లేదు. దీంతో ఈ గ్యాప్ తగ్గించేందుకు ప్రభుత్వాలు, విద్యాసంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్న్ షిప్, అప్రెంటిస్ షిప్ వంటి పేర్లతో ఉద్యోగార్ధులను ప్రోత్సహిస్తున్నాయి. ఇదే క్రమంలో ఐఐటీ మద్రాస్ కూడా తాజాగా ఉచిత ఆన్ లైన్ కోర్సుల్ని అందుబాటులోకి తెచ్చింది. వీటి వివరాలు ఓసారి చూసేద్దాం..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ ఎన్‌పిటిఇఎల్‌తో కలిసి థియరీ, ప్రాక్టికల్ అప్లికేషన్‌ల మధ్య అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో స్పోర్ట్స్ సైన్స్‌పై ఏడు కొత్త ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభిస్తోంది. ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్ధులకు ప్లస్ టూ అర్హతగా నిర్ణయించారు. స్పోర్ట్స్ సైన్సెస్, ఫిజియోథెరపీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇతర సంబంధిత రంగాలలో బ్యాచిలర్, మాస్టర్స్ అభ్యసించే విద్యార్థులకు ఈ కోర్సులు అనుబంధంగా ఉంటాయి. ఈ కోర్సులు పూర్తయిన తర్వాత విద్యార్థులు ఈ రంగాలలో డిప్లొమాలు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను చేసుకోవచ్చు.

IIT Madras offers Free Online Courses In Sports Science- here are the details

NPTEL వెబ్‌సైట్‌లో కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19, 2024గా నిర్ణయించారు. ఈ ఏడు కోర్సుల కోసం మొదటి బ్యాచ్ తరగతులు ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతున్నాయి. నేషనల్ MOOCs పోర్టల్ ఆఫ్ ఇండియా, SWAYAMలో ఆన్‌లైన్‌లో కోర్సులు ఉచితంగా అందిస్తారు.

పరీక్ష ఫీజుగా మాత్రం ఒక్కో కోర్సుకు రూ.1,000 రుసుము వసూలు చేస్తారు. కేంద్రం నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ (NPTEL)ను ఏడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాస్, బాంబే, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, గౌహతి మరియు రూర్కీ) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరుతో కలిసి 2003లో ప్రారంభించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+