JEE Main 2026 Session 2: పరీక్ష తేదీల మార్పు-సిటీ స్లిప్పుల విడుదల..!

దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల సహా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్ 2 ( JEE Main 2026 Session 2) పరీక్షలపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక అప్డేట్ చేసింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు సిటీ స్లిప్పుల్ని విడుదల చేయడంతో పాటు షెడ్యూల్ లోనూ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు jeemain.nta.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి సిటీ స్లిప్పుల్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లాక మీ అప్లికేషన్ నంబర్ తో పాటు పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే సిటీ స్లిప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష షెడ్యూల్ లోనూ మార్పులు జరిగాయి. గతంలో జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల్ని ఏప్రిల్ 2 నుంచి 9 వరకూ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది.

JEE Main 2026 Session 2 City Slips Out NTA Revises Dates to April 2-8

తాజా షెడ్యూల్ ప్రకారం బీఈ, బీటెక్, పేపర్ 1 పరీక్షల్ని ఏప్రిల్ 2, 4, 5, 6, 8 తేదీల్లో నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. అలాగే బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులకు పేపర్ 2ఏ, పేపర్ 2బీలను ఏప్రిల్ 7న నిర్వహించనుంది. ఈ పరీక్షల్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాలతో పాటు విదేశాల్లోని 15 సెంటర్లలోనూ నిర్వహిస్తున్నారు. అలాగే జేఈఈ మెయిన్ సెషన్ 2 హాల్ టికెట్లు త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఇందులో పరీక్ష తేదీ, సమయం, అభ్యర్ధి పేరు, పుట్టినతేదీ, ఇతర వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఇవి కూడా విడుదలయ్యాక అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+